ముదావత్ మురళి నాయక్ భారత సైనిక దళానికి చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025 లో పాల్గొన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కే సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ”వీర జవాన్ మురళి నాయక్ దేశానికి గర్వకారణం. తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నాం.
Also Read:Sasivadane : అక్టోబర్ 10న ‘శశివదనే’
మాకు అవకాశం దొరికితే ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దేశం గర్వపడే సినిమా అవుతుంది’ అన్నారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది ఒక రియల్ హీరో కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. నా గత సినిమా సోలో బాయ్ రిలీజ్ అయినప్పుడు మురళి నాయక్ గారి ఫ్యామిలీ ని పిలిచి వారితో మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడుతున్నప్పుడు మురళి నాయక్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. మురళి భారత సైన్యానికి సేవలందించాలనే లక్ష్యంతో ఆర్మీలో చేరారు. మురళి నాయక్ లాంటి ఎంతోమంది సైనికులు బోర్డర్ లో పోరాటం చేయడం వల్ల మనం ఇక్కడ మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం. మురళి కథ ప్రపంచానికి తెలియాలి. ఆపరేషన్ సింధూర్ మన దేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం. అలాంటి ఒక వార్ లో పాల్గొని వీరమరణం పొందిన మురళి నాయక్ కథ ప్రపంచానికి తెలియాలి. ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ నాకు చెప్పే అవకాశం రావడం నా అదృష్టం. మురళి గారి పేరెంట్స్ ని కలిసాము. వారు ఆలోచించకుండా కచ్చితంగా మీరు ఈ కథని చెయ్యండి అని చెప్పారు.