మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 8,309 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 236 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,40,08,183 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,68,790 మంది మృతి చెందారు. దేశంలో 1,03,859…
ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోన్నది ఒక్కటే.. అదే కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పటికే 13 దేశాలను చుట్టేసింది ఈ కొత్త రూపంలోని కోవిడ్.. ఇక, ఈ వేరియంట్ వెలుగుచూసిన సౌతాఫ్రికా నుంచి ఎవరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. తాజాగా సౌతాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు ఓ వ్యక్తికి వచ్చాడు.. అయితే, అతడి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.. దీంతో అతడిని ఐసోలేషన్‌లో పెట్టారు అధికారులు.. Read Also: భారీ వర్షాల నేపథ్యంలో…
ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా పసిడి బాటలో స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.67,200గా నమోదైంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,140గా.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.45,040గా నమోదైంది. కిలో వెండి…
కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి… అవసరాలను బట్టి కొన్ని ప్రత్యేక సర్వీసులను మాత్రమే తిప్పారు.. క్రమంగా కొన్ని రూట్లతో విమానసర్వీసులను నడుపూ వస్తున్నా.. అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందే లేదు.. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా సాధారణ పరిస్థితులు రావడంతో.. డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ నెల 26వ తేదీన కేంద్రం ప్రకటించింది.. కానీ, మళ్లీ ఇప్పుడు…
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ మాట బాగా వినిపిస్తోంది. అనేక రంగాల్లోకి క్రిప్టో కరెన్సీ ప్రవేశించింది. కార్ల కొనుగోలు నుంచి షాపింగ్ వరకు క్రిప్టో కరెన్సీని వినియోగిస్తున్నారు. అయితే, మనదేశంలో క్రిప్టో కరెన్సీకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రైవేట్ ఎక్సేంజీలపై నిషేదం విధించింది. క్రిప్టో కరెన్సీ ఎవరి నియంత్రణలో ఉండవు కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయడం కష్టంతో కూడుకున్నది. ఇక క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం ఓ బిల్లును తీసుకురాబోతున్నది. శీతాకాల సమావేశాల్లో…
కరోనా మహమ్మారి తరిమివేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. దీంతో వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది భారత్ ప్రభుత్వం.. అందులో భాగంగా దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆ తర్వాత మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.. ఇక, ఆ తర్వాత మరికొన్ని దరఖాస్తులు కూడా వచ్చాయి. అందులో.. పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తయారు చేస్తున్న కొవొవాక్స్ టీకా కూడా ఉంది.. అయితే, దీనికి నిపుణుల…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే వంద దాటిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను పక్కనపెట్టి పబ్లిక్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. కరోనాకు ముందు రూ.80 వరకు ఉన్న పెట్రోల్ ధరలు ఆ తరువాత వంద దాటిపోయింది. కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో చమురు ధరలపై ట్యాక్స్‌ను పెంచాయి. దీంతో చమురు ధరలు అమాంతం కొండెక్కాయి. Read: కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని పెట్టడం వెనుక కారణం ఏంటి? ఆ రెండు అక్షరాలు…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వస్తున్నాయి.. క్రమంగా అన్ని తెరచుకుంటున్నాయి.. ఈ తరుణంలో.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కునుకులేకుండా చేస్తోంది.. భారత్‌ను కూడా ఈ కొత్త వేరియంట్ టెన్షన్ పెడుతోంది.. దీంతో.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్ అప్రమత్తం అయ్యింది.. ఇక, రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది.. ఆరోగ్యశాఖల అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చర్యలకు పూనుకుంటుంది.. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై…
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(1)ను న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్ (4), పుజారా (9) ఉన్నారు. మన బ్యాట్స్‌మెన్ నాలుగో రోజు ఆటలో ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్…
కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది.. ఇప్పట్లో థర్డ్ వేవ్ ముప్పుకూడా పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వేశారు.. కానీ, కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు వెలుగుచూస్తున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. అప్రమత్తమైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, సింగపూర్లు సదరన్ఆఫ్రికా దేశాలపై ట్రావెల్బ్యాన్విధించాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం…