ఇండియాలో కరోనా టెర్రర్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,318 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,63,749 కి చేరగా ఇందులో 3,39,88,797 మంది ఇప్పటికే కోలుకున్నారు. 1,07,019 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 465 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,67,933 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ ప్రభుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించలేదు. తాలిబన్లకు మిత్రులుగా ఉన్న పాక్, చైనాలు కూడా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 22 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మరో 36 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ లు అధికారంలోకి వస్తే పాక్ ప్రాభల్యం పెరుగుతుందని, ఇది పోరుగునున్న భారత్‌కు ఇబ్బందికరమని, ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు,…
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన భారత పర్యటన ఖరారైంది. భారత్- రష్యా దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సమావేశంలో భాగంగా వచ్చే నెల 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి రానున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భేటీలో ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నట్లు తెలిపింది. అలాగే ఇరుదేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు కూడా భేటీ కానున్నట్లు పేర్కొంది. Read Also: కొత్త…
దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పేదరికం సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్…
లీటర్ పెట్రోలు ధర ఇప్పుడు 100 రూపాయలు దాటింది. రాష్ట్రాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో 110 రూపాయలుగా కూడా ఉంది. డీజిల్ ధర కూడా వందకు చేరింది. రాబోయే రోజుల్లో పెట్రో ధరలు ఇంకా పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో తరచూ పాక్షిక హెచ్చు తగ్గులు సహజం. ఒక్కోసారి ఉన్నట్టుండి బాగా తగ్గుతాయి. మరి కొన్ని సార్లు ఊహించనంత పెరుగుతాయి. 2020 ఏప్రిల్‌లో ప్రపంచ మార్కెట్లో ముడి…
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశంలో 10,549 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 488 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,39,77,830 కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,67,468 మంది మృతి చెందారు. దేశంలో 1,10,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి…
దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించే సమయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ధక్షిణాఫ్రికాలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్‌ను గుర్తించారని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడంచెల పద్దతిలో స్క్రీనింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి…
మన దేశంలో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 9,119 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 396 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,44,882 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,09,940 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా…
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ మొదటి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియగా కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా… మొదట బ్యాటింగ్ ఎంచుకావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది న్యూజిలాండ్ టీం. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరుగుతోంది. అట్ల వివరాల్లోకి వెళితే… న్యూజిలాండ్ : టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(సి), రాస్…
ఇండియాకు పాక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లే వాహనాలకు అనుమతిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పదంతోనే వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైనా ఆహారం అందక అలమటిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. Read: విచిత్రం: అంతపెద్ద పామును ఆ చేప ఎలా మింగేసింది? కాగా, ఇండియా…