ఢిల్లీః జీఎస్టీ వసూళ్ల పై… కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. నవంబర్ మాసం- 2021 జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఇవాళ వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఏకంగా… రూ.1,31,526 కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది. సీజీఎస్టీ రూ. 23,978 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 31,127 కోట్లు, ఐజీఎస్టీ రూ. 66,815 కోట్లు, సెస్ రూపంలో మొత్తం రూ. 9,606 కోట్లు వసూలు అయినట్లు ప్రకటన…
ఒమిక్రాన్..ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఇది అనేక దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డెల్టా కన్నా ఐదారు రెట్లు వేగంగా వ్యాపిస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పటికి పదిహేను దేశాలలో వీటి ఉనికిని గుర్తించారు. ఈ నేపథ్యంలో అనేక ప్రపంచ దేశాలు తమ దేశ సరిహద్దులను మూసివేశాయి. అన్ని మార్గాలలో దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాయి. మన దేశం కూడా తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు మన…
గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో భాగంగా కమర్షియల్ (వ్యాపార అవసరాలకు) గ్యాస్ సిలిండర్ ధరను రూ.103.50 మేర ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,174కి చేరింది. అటు హైదరాబాద్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,278గా నమోదైంది. కాగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం…
మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ…. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,954 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 99,023 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష లోపు దిగి రావడం శుభపరిణామం. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 267 మంది మృతి చెందారు.…
బ్యాంకులకు రుణాలు కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తాము విజయ్ మాల్యా కోసం వేచిచూడలేమని స్పష్టం చేసింది. విజయ్ మాల్యా వచ్చినా.. రాకున్నా.. జనవరి 18న శిక్షను విధిస్తామని తేల్చి చెప్పింది. Read Also: కొత్త బిజినెస్ ప్రారంభించిన ‘ఓలా’ విజయ్…
భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్ టీకాలు వేయాల్సి ఉంటుందన్నారు అదర్ పునావాలా. కోవోవాక్స్ టీకా ఆరు నెలల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు. కోవోవాక్స్‌తో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం తమ విధానమన్నారు. కోవోవాక్స్ వ్యాక్సిన్ స్టాక్ భారీగానే ఉందని, డ్రగ్ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాతే…. భారత్‌తో పాటు ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీకా…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది. దీంతో యూరప్ దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూసివేసింది. జపాన్‌లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్‌పోర్ట్‌లోనే…
న్యుజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ వచ్చే నెల 7న ముగిసిన తర్వాత భారత జట్టు 8 లేదా 9న సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళాల్సి ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా. లేదా అనే విషయం పై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో పరిస్థితి ఇంకా తీవ్రతరం కాకపోతే…
ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ సాయం అందించేందుకు పాకిస్తాన్ తన షరతుల జాబితాను భారత్‌కు పంపించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయంగా వాఘా ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు,ప్రాణాలను రక్షించే మందులను రవాణా చేయడాన్ని అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నిబంధనలు విధించింది. ఇప్పుడు ఇస్లామాబాద్ పెట్టిన రెండు షరతులు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి, సామాగ్రిని పాకిస్తానీ ట్రక్కుల ద్వారా రవాణా చేయాలని పాక్ పట్టుబడుతుంది. భారతీయులు కాకపోతే కనీసం ఆఫ్ఘన్ ట్రక్కులు మెటీరియల్‌ని ఆఫ్ఘనిస్తాన్‌కు…
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత జట్టు చివరి వరకు కష్టపడినా అది డ్రా గా ముగిసింది. కివీస్ జట్టు ఆఖరి బ్యాటర్లు వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో 4వ రోజు టీం ఇండియా డిక్లర్ చేసిన సమయం కంటే కొంచెం ముందు డిక్లర్ చేస్తే ఫలితం మరోలా ఉండేది అని చాలా వార్తలు వచ్చాయి. అయితే దీని పై స్పందించిన భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ……