ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. వివిధ అంశాలపై ఇరువురు నేతలను చర్చించారు. డిసెంబర్ 6 వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. వాణిజ్యపరమైన ఒప్పందాలతో పాటుగా, రక్షణ ఒప్పందాలు రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి.
Read: డిసెంబర్ 21, మంగళవారం దినఫలాలు…
ఇటీవలే రష్యా నుంచి ఇండియా ఎస్ 400 ట్యాంకులను కొనుగోలు చేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఇరు నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఎరువుల సరఫరా ఇతర రంగాల్లో సహకారంపై చర్చించామని, అంతర్జాతీయ పరిణామాలపైనా చర్చించినట్టు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.