అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది. టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే.. సదరు వ్యక్తి ఇప్పి వరకు టీకా తీసుకోలేదని.. అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారీన అతడు పడినట్లు సమాచారం అందుతోంది.
ఇక ఒక మరణం సంభవించడంతో… అమెరికా అప్రమత్తమైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మరణాల సంఖ్య 12 కు చేరింది. ఇది ఇలా ఉండగా.. ప్రపంచాన్ని దక్షిణాఫ్రికా వేరియంట్…వణికిస్తోన్న సంగతి తెలిసిందే. 89 దేశాల్లో కేసులు నమోదుకావడంతో…ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు…కఠిన అంక్షలు అమలు చేస్తున్నాయి. మరి కొన్ని దేశాలు…లాక్‌డౌన్ తరహా నిబంధనలకు సిద్ధమయ్యాయి.