Twitter 'Official' Tick Starts Appearing on Verified Accounts in India: ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్న తర్వాత కొత్త బాస్ ఎలాన్ మస్క్ పూర్తిగా ప్రక్షాళన చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ చివరి వారంలో ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్ తో పాటు పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు 50 శాతం మంది ఉద్యోగులు అంటే 3700 మందిని తొలగిస్తూ గత శుక్రవారం…
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో ఆర్బీఐ మాదిరిగానే వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం నిల్వలు క్రమంగా పెంచుకునే పనిలో పడిపోయాయి.. డాలర్‌పై రూపాయికి మద్దతుగా ఆర్బీఐ.. ఆయా దేశాలు తమ కరెన్సీకి సపోర్టివ్‌గా బంగారం కొనుగోలు చేశాయి. గత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్రీయ బ్యాంకులు 399.3 టన్నుల బంగారం కొనేశాయి.. అయితే 2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కేవలం 90.6 టన్నుల బంగారం మాత్రమే కొనుగోలు చేశాయి కేంద్రీయ బ్యాంకులు. ఇక, ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
‘One Earth, One Family, One future’: PM Modi unveils India’s G20 mantra: వచ్చే ఏడాది భారతదేశం జీ-20 సమావేశాలకు ఆథిత్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన లోగోను, థీమ్ ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఆవిష్కరించారు. ‘‘ఒకే సూర్యుడు,ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ తో భారతదేశం పునరుత్పాదక ఇంధన విప్లవానికి నాయకత్వం వహించిందని.. భారతదేశం ఒక భూమి, ఒక ఆరోగ్యంతో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాన్ని బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు…
India has sustantial, time-tested ties with Russia, Says EAM S Jaishankar: భారత-రష్యా స్నేహం గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల పరీక్షను ఎదుర్కొని రష్యా-భారత్ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ సంబంధాలను మరింతగా విస్తరించేందుకు ఇరు దేశాలు మార్గాలను అణ్వేషిస్తున్నాయని అన్నారు. మంగళవారం జైశంకర్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో రష్యా రాజధాని మాస్కోలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక…
టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్‌లో ఐదు మ్యాచ్‌లకు గానూ నాలుగింటిని గెలిచి టీమిండియా సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఇంగ్లండ్ జట్టుతో సెమీస్ ఆడనుంది భారత్.
దేశంలో ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దసరా, దీపావళి బొనాంజా తర్వాత వ్యాపారులకు భారీ బొనాంజా తగలనుంది. దేశంలో ఈ నెల 4న మొదలైన పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని, ఈ సీజన్లో మొత్తంగా 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు ఒకరోజు ముందుగానే వీడ్కోలు పలకనున్నారు.. రేపు అంటే నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే.. అంటే ఈ రోజే యూయూ లలిత్ చివరి పనిదినం కానుంది.. ఈ రోజే ఆయనకు వీడ్కోలు చెప్పనున్నారు.. ఉత్సవ ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత న్యాయస్థానం యొక్క లంచ్ టైం…
15 Indian Fishermen Arrested By Sri Lankan Navy: శ్రీలంక నేవీ 15 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా వచ్చినట్లు ఆరోపిస్తూ వీరిందరిని శ్రీలంక అధికారులు అరెస్ట్ చేశారు. భారతీయు అరెస్టు గురించి ఆదివారం అధికారిక ప్రకటన చేసింది శ్రీలంక. మన్నార్ ద్వీపం వాయువ్య తీరంలో ఉన్న తలైమన్నార్ లో శనివారం మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు ఆ దేశ నేవీ వెల్లడించింది. ఇటీవల తరుచుగా భారత మత్స్యకారులు శ్రీలంక…
An earthquake hits Uttarakhand:ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. డెహ్రాడూన్ తో పాటు పలు నగరాల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.