Block on Xiaomi India’s Rs. 3700 crore deposits removed by court: చైనా మొబైల్ దిగ్గజం ‘షియోమీ’కి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇండియాలో ఆర్థికపరమైన నేరాలకు పాల్పడుతున్న కారణంగా ఆ సమస్యపై భారత ప్రభుత్వం పలు కేసులను మోపింది. దీంతో ఇండియాలో షియోమీ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వివిధ కారణాల వల్ల ఆ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలోని రూ.3700 కోట్ల డిపాజిట్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లాక్ చేసింది.
Read Also: Heavy Drug Seizure: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టివేత
ఆదాయపన్ను ఎగవేత కారణంగా షియోమీ ఇండియా ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగాయి. ఐటీ శాఖ ఈ సంస్థ నిధులను స్తంభింపచేసింది. భారతదేశంలో షియోమీ తన కాంట్రాక్ట్ తయారీదారుల నుండి తక్కువ లాభాలను నమోదు చేయడానికి, కార్పొరేట్ పన్నులను ఎగవేసేందుకు పెంచిన ఖర్చులతో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా కర్ణాటక కోర్టు ఈ సంస్థ నిధులపై విధించిన బ్లాక్ ను రద్దు చేసింది. ఇది కంపెనీకి సానుకూలంగా ఉండబోతోంది. ఇదిలా ఉంటే షియోమీ అక్రమంగా విదేశీ చెల్లింపులు చేసిందనే మనీలాండరింగ్ కు పాల్పడిందని ఈడీ కేసు నమోదు చేసింది.
ఇండియాలో షియోమీ ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉంది. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను అందిస్తోంది. భారత్ తో ఎక్కువగా అమ్ముడవుతున్న ఫోన్లలో షియోమీనే టాప్ లో ఉంది. అయితే ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు ప్రభుత్వం దీనిపై కేసులు నమోదు చేసింది. దీంతో ఆ సంస్థపై ప్రభావం పడనుంది.