China: చైనా కుయుక్తులు.. సరిహద్దు వెంబడి యుద్ధవిమానాల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China has deployed drones and warplanes along the border: జిత్తులమారి చైనా భారత సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది. సరిహద్దు వెంబడి పలు ఎయిర్ బేస్ లను నిర్మించిన చైనా దాని వెంబడి సైనిక మోహరింపును పెంచుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఘర్షణల తర్వాత డ్రాగన్ కంట్రీ తన కుతంత్రాలకు పదును పెడుతోంది. హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు చైనా మోహరింపును స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత ఈశాన్య ప్రాంతానిక అతి దగ్గరలో వీటిని మోహరించింది.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో చైనా బంగ్డా ఎయిర్ ఎయిర్‌బేస్ లో అత్యాధునిక WZ-7 ‘సోరింగ్ డ్రాగన్’ డ్రోన్ ను ఉంచింది. 2021లో తొలిసారిగా ఈ డ్రోన్ ను చైనా ఆవిష్కరించింది. ఏకంగా 10 గంటల వరకు నాన్ స్టాప్ గా ఎగరడం దీని ప్రత్యేకత. నిఘాతో పాటు క్రూయిజ్ క్షిపణులను ఇది భూమిపై లక్ష్యాలపై ప్రయోగించగలదు. అయితే ప్రస్తుతం భారత్ వద్ద ఇలాంటి డ్రోన్లు లేవు. అయితే ప్రస్తుతం ఇండియా ఎయిర్ ఫోర్స్ కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ తో కలిసి కొత్త తరం డ్రోన్లను తయారు చేస్తోంది.
Also Read

Read Also: FIFA World Cup: సేమ్ టు సేమ్.. సచిన్‌కు జరిగిందే.. మెస్సీకి జరిగింది..!!
డిసెంబర్ 14 తీసిన చిత్రాల్లో చైనా బాంగ్డా ఎయిర్‌బేస్ లో రెండు ఫ్లాంకర్ తరగతికి చెందిన ఫైటర్ జెట్లను ఉంచింది. ఈ రకం ఫైటర్ జెట్లు రష్యా సుఖోయ్-30ఎంకేఐ తరహా విమానాలు మేడ్ ఇన్ చైనా వేరియంట్లు. ముఖ్యంగా 2017 డోక్లాం ప్రతిష్టంభన తర్వాత చైనా ఈశాన్య సరిహద్దుల్లో సైనికీకరణను పెంచింది. లాసా గోంగ్‌గర్ విమానాశ్రయం రన్ వేను విస్తరించింది. టిబెట్ ప్రాంతంలోని అన్ని ఎయిర్ బెస్ లను అప్ గ్రేడ్ చేసింది. సైనికులను వేగంగా తరలించేందుకు రోడ్డు,రైలు మార్గాలను విస్తరించింది. భారత్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో (తవాంగ్ సెక్టార్) ఇరు దేశాల సైనికులు ఘర్షణతో మరోసారి సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. చైనా మూడు కీలక ఎయిర్ బేసుల అభివృద్ధి చేస్తోంది. బంగ్డా( అరుణాచల్ సరిహద్దు నుంచి 150 కిలోమీటర్లు), లాసా ( సరిహద్దు నుంచి 260కిలోమీటర్లు), షిగట్సే(సిక్కిం సరిహద్దు నుంచి 150 కిలోమీటర్లు) ఎయిర్ బేసులను డెవలప్ చేసింది.
అయితే భారత్ తేజ్‌పూర్, మిస్సమారి, జోర్హాట్, హషిమారా మరియు బాగ్డోగ్రాలతో సహా అస్సాం, బెంగాల్ ప్రాంతాల్లో ఎయిర్ బేసులను నిర్వహిస్తోంది. చైనా ఎయిర్ బేసులతో పోలిస్తే భారత ఎయిర్ బేసులు వ్యూహాత్మకంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. చైనా ఎయిర్ బేసులు పూర్తిగా టిబెట్ ప్రాంతంలో ఎతైన ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో బరువులను మోసుకెళ్లాలంటే చైనా విమానాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అయితే భారత్ వైమానికి స్థావరాల నుంచి యుద్ధవిమానాలు సులువుగా ఇంధనం, క్షిపణులను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!