Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 1 Pm On December 19th 2022

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Published Date :December 19, 2022 , 1:39 pm
By Sudhakar Ravula
Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

నాకు కుప్పంతో ప్రత్యేక అనుబంధం ఉంది..
చెన్నైలో ఆదివారం జరిగిన ‘లత్తి’ (తెలుగులో లాఠీ) చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు హీరో విశాల్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. తనకు అక్కడ పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. కుప్పం ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉన్న సంగతి నిజమే.. కానీ, తాను అక్కడినుంచి పోటీ చేస్తానన్న వార్తల్లో మాత్రం నిజం లేదని కుండబద్దలు కొట్టారు.. అయితే, తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనన్నారు విశాల్.. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీకి దిగుతానన్న ఆయనే.. కుప్పంలో మా నాన్న గ్రానైట్ వ్యాపారం చేసేవారని.. ఆ సమయంలో మూడేళ్లపాటు కుప్పంలో ఉన్నాను అని గుర్తుచేసుకున్నారు.. ఇక, పెళ్లి ఎప్పుడంటూ ఎదురైన ప్రశ్నపై స్పందిస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు విశాల్.. మొత్తంగా.. కుప్పంలో చంద్రబాబుపై విశాల్‌ పోటీపై క్లారిటీ వచ్చినట్టు అయ్యింది.

కేసులకు భయపడం..
మాచర్లలో టీడీపీ కార్యకర్తలు చూపించిన చొరవ, పౌరుషం కొనసాగించాలని పిలుపునిచ్చారు బ్రహ్మారెడ్డి.. నన్ను కాపాడటానికి పార్టీ కార్యకర్తలు చూపిన తాపత్రయం నేను మర్చిపోలేనన్న ఆయన.. టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన పని లేదు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం మనకు అండగా ఉంటుందన్నారు.. ఇక, పల్నాడులో పుట్టినవాళ్లు పోలీస్ స్టేషన్ గడప తొక్కకుండా ఎవరూ లేరు.. పోలీసు కేసులకు భయపడాల్సిన పనిలేదన్నారు.. కార్యకర్తల తరపున న్యాయ పోరాటం చేయటానికి పార్టీ సిద్ధంగా ఉంది. ప్రత్యేక పరిస్థితుల వల్ల నేను మీకు నేరుగా అందుబాటులో రాలేకపోతున్నాను.. ఈ పరిస్థితి బాధాకరం. మీకు ఏమైనా ఇబ్బంది జరిగితే రాష్ట్ర పార్టీకి తెలియజేయండి అని సూచించారు టీడీపీ మాచర్ల ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి. కాగా, మాచర్లలో దాడికి గురైన టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఫోన్‌లో మాట్లాడిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. బాధితులను పరామర్శించారు. ప్రతి ఒక్క బాధితునితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ నేతలను అక్రమ కేసుల నుంచి బయటపడెయ్యడమే కాకుండా, అసలు కారకులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించిన విషయం విదితమే.

Also Read

  • Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

పవన్ కల్యాణ్‌ రద్దైన నోట్లతో సమానం..!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్.. వైసీపీ నేతలపై జనసేనాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ గెలవదు శాసనం అని చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా..? 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని చెప్తే ప్రజలు పవన్‌ను గేటు కూడా తాకనివ్వలేదు అని కౌంటర్‌ ఇచ్చారు. ఇక, పవన్‌ కల్యాణ్ వారాలబ్బాయి అంటూ సెటైర్లు వేసిన ఆయన.. వైఎస్‌ జగన్ నిలబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన నువ్వు జగన్‌ను విమర్శించడమా..? నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ రాజకీయాల్లో పవర్ లేని స్టార్.. అంటూ ఎద్దేవా చేశారు. కాల్షీట్ ఉంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు, కాల్షీట్స్ ఖాళీ అయితే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుంటాడు అంటూ ఆరోపణలు గుప్పించారు. పవన్‌ కల్యాణ్‌ను కాపులు కూడా నమ్మే స్థితిలో లేరన్నారు వెల్లంపల్లి.. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా పవన్ కల్యాణ్‌కు ఉందా? అని నిలదీసిన ఆయన.. పవన్‌ కల్యాణ్‌ రద్దైన నోట్లతో సమానం అనే సంచనల వ్యాఖ్యలు చేశారు..

రైళ్లలో సంక్రాంతి రద్ది
కొత్త సంవత్సరంలో అడుగులు పెట్టేందుకు ఇక కొద్దిరోజు మాత్రమే ఉంది. కొత్త సంవత్సరంలో మొదటి సంవత్సరం జనవరి. జనవరిలో వచ్చే సంక్రాంతి తెలుగు రాష్ర్టాల్లో అతి పెద్ద పండుగల్లో ఒకటి. ఉద్యోగం, విద్య, ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా ఈ పండుగకు సొంతూరి బాట పడుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సంక్రాంతికి ఇంకా నెల రోజులు ఉన్నా సొంతూరుకు వెళ్లేదెలారా దేవుడా అంటూ దిగులు పట్టుకుంది. ఎందుకంటే సొంతూరు రైళ్లలో రిజర్వేషన్లు మూడు నెలల ముందే అయిపోయాయి. ఏ రైళ్లలో చూసిన వెయిటింగ్‌ లిస్టు పరిమితీ దాటేసింది. అదనంగా ప్రత్యేక రైళ్లు నడుపుతారా? ఉన్న రైళ్లకు అదనంగా బోగీలనే జోడిస్తారా అనే ఆశగా ఎదురు చూస్తున్నా ప్రయాణికులకు నిరాశే ఎదురవుతుదేమో? అంటున్నారు ప్రయాణికులు. రోజులు. వారాలు గడుస్తున్నాయి అయితే ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలపై ఏ ప్రకటనలు రాలేదు. నీరక్షణ జాబితా పెరుగుతుండటంతో అనేకమంది ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకుంటున్నారు. జనవరి 12న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో 1,102 మంది ఉండగా.. 624 మంది టిక్కెట్లు రద్దు చేసుకున్నారు. థర్డ్ ఏసీలోనే 384 మంది వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు తీసుకున్నారు. 11వ తేదీన వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న 784 మందిలో 285 మందిని రద్దు చేశారు. గత సంక్రాంతి సందర్భంగా పండుగకు కొద్ది రోజుల ముందు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే అప్పటికే చాలా మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు వంటి ప్రయత్నాలు ఎంచుకుంటున్నారు. రైళ్లు ఎక్కడానికి వస్తున్న ఆదాయం రైల్వేశాఖ పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుందేమోనని విశ్వసనీయ సమాచారం.

ఐస్‌క్రీమ్‌ డెలివరీ బాయ్‌ అకృత్యం..
కేరళలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త్రిసూర్‌లోని ఇరింజలకూడ ప్రాంతంలో ఉన్న ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు 28 ఏళ్ల నియాస్‌.. అయితే, ఆన్‌లైన్‌ యాప్‌లో ఐస్‌క్రీమ్‌కు ఆర్డర్‌ చేసింది ఓ మహిళ.. ఇక, ఐస్‌క్రీమ్‌ డెలివరీ ఇచ్చేందుకు ఆ మహిళ ఇంటికి వెళ్లిన నియాస్‌.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ తర్వాత అసలు రూపాన్ని బయటపెట్టాడు.. బాధితురాలిని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు.. రూ. 90 లక్షలు ఇవ్వకుంటే లైంగిక దాడి గురించి నీ భర్తకు, కుమారుడికి చెబుతానని బెదిరింపులకు దిగాడు.. పరువు పోతుందని వణికిపోయిన బాధితురాలు, తన బంగారంతో పాటు స్థలాలు కుదవబెట్టి మరీ.. తనకు సాధ్యమైనప్పుడల్లా.. పలు దఫాలుగా రూ. 90 లక్షలు ఇచ్చుకుంది.. అయినా, వేధింపులు, బెదిరింపులు ఆగకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించారు బాధిత మహిళ.. ఇక, కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. నియాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.. అతడిపై ఇప్పటికే చాలా కేసులున్నాయని తేల్చారు.. ఇదే తరహాలో చాలామంది మహిళలపై లైంగికదాడికి పాల్పడి.. ఆ తర్వాత బ్లాక్‌ మెయిల్‌ చేసి.. డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు.

నీట మునిగిన యుద్ధ నౌక
సోమవారం గల్ఫ్‌ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఒక థాయ్ యుద్ధ నౌక (హెచ్‌టీఎంస్‌ సుఖొథాయ్‌) ప్రమాదవశాత్తూ నీట మునిగింది. బలమైన ఈదురుగాలుల కారణంగా.. సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరింది. మొబైల్ పంపింగ్ మిషన్ల ద్వారా లోపలికి వచ్చిన నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ.. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడం, ఇంజిన్ కూడా పని చేయకపోవడంతో ఆ నౌకలోకి మరింత నీరు వచ్చి చేరింది. దీంతో.. ఆ నౌక ఒకవైపుకి ఒరుగుతూ, సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ నౌకలో మొత్తం 106 మంది నేవీ సిబ్బంది ఉండగా.. 31 మంది గల్లంతయ్యారు. మరో 75 మందిని సహాయక సిబ్బంది కాపాడగలిగింది. థాయ్‌లాండ్‌లోని ప్రచుప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ యుద్ధ నౌక ఆదివారం సాయంత్రం విధుల్లో పాల్గొంది. అయితే.. ఇంతలోనే అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో, ఈ నౌక ప్రమాదానికి గురైంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే.. థాయ్ నౌకాదళం సంఘటనా స్థలానికి వెంటనే మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాప్టర్లను పంపించింది. ఎలాగైనా నీట మునగకుండా ఆ నౌకను కాపాడేందుకు వాళ్లు సహాయక సిబ్బంది వారు తీవ్రంగా శ్రమించారు. కానీ, బలమైన గాలుల కారణంగా అది సాధ్యపడలేదు. గల్లంతైన 31 మంది కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో నావికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్తున్నారు.

‘ఖుషి’ రీరిలీజ్..
పవర్ స్టార్ పవన్ కస్ల్యాన్ నటించిన సినిమాల్లో అభిమానులకి బాగా నచ్చిన చిత్రం ఏది అంటే ఒకరు ‘జల్సా’ అంటారు, ఇంకొకరు ‘గబ్బర్ సింగ్’ అంటారు, మరొకరు ‘బద్రీ’ అంటారు కానీ దాదాపు మెజారిటీ ఫాన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఖుషి’. ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ 7వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి మధ్య డైరెక్టర్ డిజైన్ చేసిన సీన్స్ ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటాయి. ఒక బ్యుటిఫుల్ లవ్ స్టొరీకి హీరో యాటిట్యూడ్ తోడైతే ఎలా ఉంటుందో ‘ఖుషి’ సినిమా చూపించింది. ఈ మూవీలో ‘నువ్వు గుడుంబ సత్తి కావొచ్చు, తొక్కలో సత్తి కావొచ్చు బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐయామ్ సిద్ధూ, సిద్దార్థ్ రాయ్’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ని ఈరోజుకి ఆయన ఫాన్స్ వాడుతూనే ఉంటారు. ‘ఖుషి’ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ ఉంటాయి. ఈ ప్రేమ కథా చిత్రానికి అతిపెద్ద బలం సంగీతం. మణిశర్మ ‘ఖుషి’ సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. 2001లో దాదాపు ఆ ఏడాది మొత్తం ‘ఖుషి’ పాటలు మోతమోగుతునే ఉన్నాయి అంటే మణిశర్మ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ‘ఖుషి’ సినిమా పాటలే కాదు ఈ మూవీలో మణిశర్మ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అప్పట్లో ప్రతి ఒక్కరి ఫోన్ కి ‘ఖుషి’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రింగ్ టోన్ గా ఉండేది. ఇలాంటి ఒక మోడరన్ క్లాసిక్ లవ్ స్టొరీ సినిమాని రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీని డిసెంబర్ 31న ఆడియన్స్ ముందుకి రానుంది అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఏ.ఎమ్ రత్నం’ నిర్మాణ సంస్థ అయిన ‘శ్రీ సూర్య మూవీస్’ బ్యానర్ పై ‘ఖుషి’ సినిమా తెరకెక్కింది. ఈ రీరిలీజ్ గురించి ‘ఏ.ఎమ్ రత్నం’ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా బయటకి రాలేదు. మరి డిసెంబర్ 31కి ఇంకా సమయం ఉంది కాబట్టి మేకర్స్ ఆ లోపు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో చూడాలి.

అమెరికా గడ్డపై అన్నగారి విగ్రహం…
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, సినీ కళామతల్లి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటనా చాతుర్యం… అన్నీ కలసిన ఏకైక రూపం ‘ఎన్టీఆర్’. సినిమాల నుంచి రాజకీయాల వరకూ తనదైన ముద్ర వేసి, దశాబ్దాలుగా తెలుగు ప్రజల ప్రేమని పొందుతున్న మహనీయుడు ‘నందమూరి తారకరామారావు’. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు వాడి పౌరుషానికి ప్రతీకగా కనిపించే ఎన్టీఆర్ కీర్తి ఎల్లలు లేనిది. అందుకే ఆయన శత జయంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయనున్నారు. న్యూ జెర్సీలోని మాడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ ప్రముఖ నిర్మాత ‘విశ్వ ప్రసాద్’ ప్రతిపాదించాడు. ‘నార్త్ అమెరికన్ సీమాంధ్రా అసోసియేషన్'(NASAA) తరపున ఈ విగ్రహా బాధ్యతలు తీసుకుంది. విదేశీ గడ్డపై ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఇదే మొదటిసారి. దీంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా నందమూరి అభిమానులు ట్వీట్స్ చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణకి నందమూరి బాలకృష్ణ హాజరయ్యే అవకాశం ఉంది.

మెస్సీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్
ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ముందువరకూ.. తనకు ఇదే చివరి వరల్డ్‌కప్ అని, మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తానని లియోనెల్ మెస్సీ పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే! కానీ.. ఇప్పుడు ఈ విషయంలో అతడు యూ-టర్న్ తీసుకున్నాడు. తనకు ఇప్పుడప్పుడే ఫుట్‌బాల్ ఆటకు గుడ్‌బై చెప్పాలని లేదని చెప్పాడు. వరల్డ్ ఛాంపియన్‌గా తనకు మరికొన్ని గేమ్స్ ఆడాలని ఉందని, తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకరకంగా ఇది అతని అభిమానులకు పండగలాంటి వార్తేనని చెప్పుకోవాలి. మెస్సీ మాట్లాడుతూ.. ‘‘ఈ వరల్డ్‌కప్ అనంతరం నేను ఫుట్‌బాల్ ఆటకు గుడ్‌బై చెప్పాలని అనుకున్నా. నా కెరీర్‌లో వరల్డ్‌కప్ లేదనే లోటు ఉండేది, ఇప్పుడది తీరిపోవడంతో నేను ఇంకేం కోరుకోవడం లేదు. ఇంతకుముందు కోపా అమెరికా సాధించాడు. ఇప్పుడు ఈ వరల్డ్‌కప్ గెలుపొందాను. ఈ వరల్డ్‌కప్ కోసం ఎంతో శ్రమించి, చివరికి నా కెరీర్‌కి గుడ్‌బై చెప్పే సమయంలో సాధించగలిగాను. అయితే.. వరల్డ్ ఛాంపియన్‌గా నాకు మరిన్ని గేమ్స్ ఆడాలని ఉంది. నాకు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం’’ అంటూ చెప్పుకొచ్చాడు. తనకు మరిన్ని గేమ్స్ ఆడాలని ఉందని మెస్సీ స్పష్టం చేయడాన్ని బట్టి చూస్తే.. అతడు ఇప్పుడప్పుడే ఫుట్‌బాల్‌కి గుడ్‌బై చెప్పడని క్లారిటీ ఇచ్చేసినట్టే! ఒకవేళ సాధ్యమైతే.. వచ్చే వరల్డ్‌కప్ వరకూ అతడు కొనసాగినా కొనసాగవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • india
  • telangana
  • Top Headlines
  • Top Headlines @ 1 PM

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions