వన్డే ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అక్కడ వర్షం పడుతుంది. ఆ కారణంగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Indian Census: దేశంలోని లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్ చట్టం' బిల్లు ఆమోదం పొందిన తర్వాత భారత జనాభా లెక్కలపై చర్చ మొదలైంది.
ఆసియా క్రీడలలో భారత్ జోరు కొనసాగుతుంది. తాజాగా ఇండియా మరో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల షాట్పుట్ ఈవెంట్లో కిరణ్ బలియన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్కు ఇది 33వ పతకం.
గతేడాది గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తాను కాదని గుజరాత్ ప్రజలేనని సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ తీవ్ర ప్రచారం తర్వాత, ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల వాతావరణాన్ని మార్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అదే నినాదం ఇచ్చారు.
Afghanistan: భారతదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. న్యూఢిల్లీలో ఆఫ్గాన్ ఎంబసీ మూసివేసింది. గత కొన్ని నెలలుగా భారత్ లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముగ్గురు రాయబార కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తాజాగా.. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో మరో పతకం ఖాయమైంది. జోర్డాన్ క్రీడాకారిణి హనన్ నాసర్తో జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్లో నిఖత్ జరీన్ ఏకపక్షంగా ఆడింది. ఈ విజయంతో నిఖత్.. 2024లో పారిస్లో జరిగే ఒలింపిక్ క్రీడల కోటాను దక్కించుకుంది.
మరో వారం రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్కు చేరుకోగా.. వార్మప్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభించాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్కు ఇండియా ఆతిథ్యమిస్తుండటం విశేషం. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ కూడా మొదలైంది. కొందరు క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్లను తెలిపారు.
2024లో ఏకకాలంలో ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని లా ప్యానెల్ విశ్వసిస్తోందని వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు భారత్తో పోలిస్తే చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు.
Indian Shooters wins 2 Gold Medals Today in Asian Games 2023: ఆసియా గేమ్స్ 2023లో భారత్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో ఐష్వరి ప్రతాప్ సింగ్, స్వప్నిల్ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్ మెడల్ సాధించింది. భారత్ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత…