ICC వరల్డ్ కప్ 2023కి ముందు స్టార్ పాకిస్థాన్ ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ తన పేలవమైన ఫామ్‌ను అంగీకరించాడు. షాదాబ్ ఖాన్ తన అధ్వాన్నమైన బౌలింగ్ ప్రదర్శనలు అతని మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని చెప్పాడు. షాదాబ్ ఖాన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ రానించగల సత్తా ఉంది. అయితే ఈ ఆల్ రౌండర్ 2023 ఆసియా కప్‌లో 4.33 సగటుతో 13 పరుగులు మాత్రమే చేశాడు. 40.83 సగటుతో కేవలం ఆరు వికెట్లు తీశాడు.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. దక్షిణ కొరియా మహిళల జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో.. భారత జట్టు మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది. దీంతో భారత మహిళల జట్టు సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది.
భారత దేశ అభివృద్ధిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్‌కు ఆధునిక పరికరాలతో కూడిన బలమైన సాయుధ బలగాలు అవసరమని రక్షణ మంత్రి ఆదివారం పేర్కొన్నారు. మూడు సేవల ద్వారా ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.
Virat Kohli should play 4th ICC ODI World Cup: భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జల్టు తలపడనున్నాయి. ఇక అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయర్స్…
India Wins First Medal in Golf: ఆసియా గేమ్స్ 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్లో మరో స్వర్ణ పతకం వచ్చింది. ఎనిమిదో రోజైన ఆదివారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు పసిడిని కైవసం చేసుకుంది. కువైట్, చైనాల నుంచి ఎదురైన పోటీని తట్టుకోగలిగిన భారత్ పోడియంపై అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పురుషుల ట్రాప్ టీమ్ 361 పాయింట్లు…
These 9 Teams did not beat Team India in ICC ODI World Cups: ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత గడ్డపై జరిగే మెగా టోర్నీ అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ…
ఆసియా క్రీడలు 2023లో పాకిస్థాన్‌తో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10-2 తేడాతో విజయం సాధించింది.
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్‌లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్‌లో భారత్ పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అభయ్‌సింగ్ పాకిస్థాన్‌కు చెందిన జమాన్ నూర్‌పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ప్రపంచ కప్‌కు ముందు ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్ 2023లో సిరాజ్ ఆటతీరు చూడదగినదని స్టెయిన్ చెప్పాడు. ప్రపంచకప్‌లో అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్లపైనే ఉంటుందని స్టెయిన్ అన్నాడు. అందులో మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు కీలకమని నిరూపించుకుంటాడని తెలిపాడు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత్ జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది.