ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఆరోపణలతో భారత్- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో కెనడా కన్జర్వేటివ్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రే మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న తరువాత, ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంతో సంబంధాల విలువను అర్థం చేసుకోలేకపోయారు అని ఆయన అన్నారు.
Read Also: Gold Price Today :మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?
తాను కెనడా ప్రధాని అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరిస్తానని కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ పియర్ పోయిలీవ్రే చెప్పారు. భారత ప్రభుత్వంతో వృత్తిపరమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం.. రెండు దేశాల మధ్య విబేధాలు ఉన్నా ఫర్వాలేదు కానీ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ప్రొఫెషనల్ గా ఉండాలి.. నేను కెనడా ప్రధాని అయితే భారత్‌తో సంబంధాలను పునరుద్ధరిస్తాను అంటూ పోయిలీవ్రే పేర్కొన్నారు. భారతదేశం నుండి 41 మంది కెనడియన్ దౌత్యవేత్తలను రీకాల్ చేయడం గురించి అడిగినప్పుడు, అతను ట్రూడో అసమర్థుడు మరియు వృత్తిపరంగా లేడని ఆరోపించారు. నేడు, కెనడాకు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలతో విభేదాలు ఉన్నాయి. కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారనే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పియర్ పోయిలీవ్రే అన్నారు.
Read Also: Devaragattu Bunny Festival: దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి, 100 మందికి పైగా గాయాలు..
అయితే, 41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేయాల్సిందిగా గత వారం భారత్ కెనడాను కోరింది.. ఇక, భారత్- కెనడా రెండు దేశాల దౌత్యవేత్తల సంఖ్య సమానంగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. మేము ఇంతకు ముందే చెప్పినట్లు.. భారతదేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, వారు మన దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారని బాగ్చి చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కెనడియన్ దౌత్యవేత్తలు భారత్‌లో తమ సంఖ్యను తగ్గించుకుని తిరిగి వెళ్లాలని భావిస్తున్నాము అని అతను వెల్లడించారు.