Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సంబంధం లేదు.. యూకే పార్లమెంట్‌లో పీఓకే ప్రొఫెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఆయన అన్నారు. కొంతమంది బ్రిటీష్ ఎంపీలతో సహా పలువురు వక్తలు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీరీ పండిట్ల పోరాటాలు, జమ్మూ కాశ్మీర్ పురోగతిపై చర్చించారు.
1947 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ భారత్ లో చేరి 76 ఏళ్లు అయిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని జరిపారు. జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ కి హక్కు లేదని సజ్జద్ రజా స్పష్టం చేశారు. రజా పీఓకేలో నేషన్ ఈక్వాలిటీ పార్టీకి చెందిన వారు. జమ్మూ కాశ్మీర్ వివాదంలో రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని, ఒకటి భారత్ కాగా.. రెండోడి జమ్మూ కాశ్మీర్ అని ఆయన అన్నారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
Read Also: Father Abuse: విశాఖలో దారుణం.. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి
1947లో బ్రిటీష్ ప్రభుత్వం చేసిన తప్పులకు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓజేకే)లో ప్రజలు ఇప్పటికి ఇబ్బందులు పడుతున్నారని, ఎలాంటి హక్కులు లేకుండా బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జద్ రజా మాట్లాడుతూ.. నేను నా చేతిలో తుపాకీలతో ఈ గదిలోకి ప్రవేశిస్తే నన్ను తరిమేయాలని భావిస్తారు, చట్టబద్ద పార్టీగా గుర్తిస్తారా..? అంటూ పాకిస్తాన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.
మన ప్రాథమిక హక్కుల కోసం పాకిస్తాన్ ను ఎదురించాలి, మనల్ని జంతువులుగా చూడకూడదని, మనం కూడా మనుషులమే అని, శాంతియుతంగా జీవించడానికి, ఆధునిక సౌకర్యాలను ఆస్వాదించడానిక మాకు అన్ని హక్కులు ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్ ,లడఖ్ లోని ప్రజలు జీవితాన్ని ఆనందిస్తున్నారని సజ్జద్ రజా అన్నారు. భారత్-పాక్ విభజన సమయంలో హిందువులు, సిక్కులపై జరిగిన దురాగతాలను కూడా ఆయన ప్రస్తావించారు.
ఈ కార్యక్రమాన్ని బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్ లోని పురోగతిని ఎంపీ థెరిసా విలియర్స్ ప్రశంసించారు. సీమాంత ఉగ్రవాదాన్ని ప్రొత్సహించొద్దని బాబ్ బ్లాక్‌మన్ పాకిస్తాన్ కి హితవు పలికారు. కాశ్మీరీ పండిట్ల సమస్యకు రాజకీయ సంకల్పం లేకపోవడం గురించి గౌతమ్ సేన్ మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాలే ఇందుకు కారణమని ఆరోపించారు.
- Tags
- india
- jammu kashmir
- Pakistan
- PoK
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!