Pakistan: పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మరో ఇద్దరు భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్ ముజామిల్, నయీమూర్ రెహ్మన్‌లను సియాల్‌కోట్ నగరంలో హతమార్చారు. పోలీస్ యూనిఫాం ధరించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దర్ని కాల్చివేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో మహ్మద్ షాజాద్, అలీ హసన్ అనే ఇద్దరు పాదచారులకు గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సియాల్‌కోట్ జిల్లా పస్రూర్ డీఎస్పీ రాహా మహ్మద్ షాబాజ్ పోలీస్ అధికారుల బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో ఈ హత్యలకు సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు భూవివాదం కారణంగా ఈ కాల్పులు జరిగాయని పేర్కొన్నారు.
Read Also: Maldives: మాది చిన్న దేశం, భారత్‌తో శత్రుత్వం పెంచుకోం..మాల్దీవుల అధ్యక్షుడు..
గతంలో కూడా పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని ఇలాగే గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. రెండు రోజుల క్రితం జైషే ఉగ్రవాది మసూద్ అజార్ కి అత్యంత సన్నిహితుడైన మౌలానా రహీం ఉల్లా తారిఖ్‌ని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అంతకుముందు మ్మూలోని సుంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై 2018 దాడికి సూత్రధారి అని నమ్ముతున్న ఖ్వాజా షాహిద్ అనే ఉగ్రవాదిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లో కిడ్నాప్ చేసి, తల నరికి చంపేశారు. అక్టోబరులో, మసూద్ అజార్ యొక్క విశ్వసనీయ సభ్యుడిగా కూడా పరిగణించబడే దౌద్ మాలిక్, వజీరిస్థాన్‌లో పట్టపగలు హత్య చేయబడ్డాడు. వీరే కాకుండా జమాతే ఉద్ దావా, లష్కర్ ఉగ్రవాది హఫీస్ సయీద్ అత్యంత సన్నిహితుడు మాలిక్, ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కూడా గత నెలలో ఇలాగే హత్యలు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పాక్ గడ్డపై హతమైన భారత వ్యతిరేక ఉగ్రవాదుల సంఖ్య 20ని దాటింది.
Pakistan- 'Unknown Men' on motorcycle have targeted and killed Md. Muzamil, a member of Lashkar-e-Toiba, along with his associate Naeemur Rahman at Khokhran Chowk in Pasrur tehsil, third one cirical.
Police claims land dispute but unable to find the 'Unknown Men' pic.twitter.com/HWzMjRSkZ2
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 15, 2023