ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు మరొక రోజే సమయం ఉంది. ఈ మహాసంగ్రామం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ టోర్నీలో అన్నింటిలో అన్నీ మ్యాచ్లు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియాను ఒక సమస్య భయపెడుతుంది. అదేంటంటే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టైటిల్ మ్యాచ్‌లో, టీమిండియాకు అచ్చురాని అంపైర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే రిచర్డ్ కెటిల్‌బరో.. ఇప్పుడు ఈ అంఫైర్ టీమిండియాకు పెద్ద ముప్పులా మారే అవకాశం ఉంది. ఈ ప్రపంచ కప్‌లో రిచర్డ్ కెటిల్‌బరో తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఇంతకుముందు.. టీమిండియా ఆడిన మ్యాచ్‌లలో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్న మ్యాచ్లు ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్కు కెటిల్ బరో రావడం అశుభ సంకేతంగా సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Jay Shah: జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు.. ఆ విషయంలోనే..!
గత ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్న టీమిండియా మ్యాచ్లు ఓడిపోయాయి. టీ20 వరల్డ్ కప్ 2014 ఫైనల్‌లో భారత జట్టు శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్ గా ఉన్నాడు. ప్రపంచ కప్ 2015 సెమీ-ఫైనల్స్‌లో కూడా టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత.. టీ20 ప్రపంచ కప్ 2016 ఫైనల్‌లో టీమిండియా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లన్నింటికీ రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్ గా ఉన్నాడు.
Kerala Nurse: నర్సు నిమిష ప్రియ కథ.. దేశం కానీ దేశంలో మరణశిక్ష.. అప్పీల్‌ని తిరస్కరించిన కోర్టు..
ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో టీమిండియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. అయితే ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో కూడా అంపైర్గా రిచర్డ్ కెటిల్‌బరో ఉన్నాడు. ప్రపంచ కప్ 2019 సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఓటమిని మూటగట్టుకుంది. అప్పుడు కూడా రిచర్డ్ కెటిల్‌బరోనే ఉన్నాడు. అయితే ఇప్పటి ఫైనల్ మ్యాచ్కు రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్గా వ్యవహరిస్తుండటంతో.. భారత అభిమానుల్లో ఎక్కడో కొద్దిగా టెన్షన్ నెలకొంది.
ICC doesn't have any better umpire than Richard Kettleborough or what. This guy is always there in our heartbreaks. pic.twitter.com/o7DVdHLCei
— R A T N I S H (@LoyalSachinFan) November 17, 2023