లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు., ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బీఎస్పీ ఎంపీ మలక్ నగర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి నిజంగా బీజేపీని ఓడించాలనుకుంటే.. మాయావతిని భారత కూటమికి ప్రధాని అభ్యర్థిగా చేయాలని.. ఇది జరగకపోతే.. బీజేపీని గద్దె దించడం అసాధ్యం అని ఆయన చెప్పారు. మోడీని అడ్డుకునేందుకు బీఎస్పీతో పొత్తు అవసరం.
మరో రెండు రోజుల్లో పాత ఏడాది పోయి, కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం.. ప్రతి ఏడాది చివర్లో సంవత్సరంలో జరిగిన చిత్ర, విశేషాలు నెమరేసుకుంటూ ఉంటాము.. ఇప్పటికే ఎన్నో విషయాల గురుంచి తెలుసుకున్నాం.. ఇప్పుడు ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టిన టీమ్ ఇండియా క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. 2023 జనవరి 23న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ నటి అథియా శెట్టిని…
దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదన్న బాధతో ఈ వరుసకు బ్రేక్ వేసేందుకు టీమిండియా కష్టాల్లో పడింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రెండో రోజు ఘోరంగా వెనుకబడింది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. ఇంకా 5 వికెట్లు మిగిలి ఉన్నాయి.
Covid-19 : భారత్‌లో మరోసారి కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. బుధవారం (డిసెంబర్ 27) భారతదేశంలో ఒకే రోజులో 529 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు.
Covid variant JN.1: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీంతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 63 కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులన్నీ కూడా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం 63 కేసుల్లో గోవాలో అత్యధికంగా 34 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4,…
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాదులు బయలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెర్రరిస్టులకు స్వర్గధామంగా ఉన్న పాక్‌లో జిహాదీలు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, అత్యంత సమీపం నుంచి చంపిపారిపోవడం అక్కడ నిత్యకృత్యంగా మారింది.
France: మానవ అక్రమ రవాణా అనుమానంతో దుబాయ్ నుంచి 303 మంది భారతీయులతో సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం భారతీయులను ఫ్రాన్స్ నుంచి పంపించేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ రోజు అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది.