Drone Attack: రెడ్ సీ(ఎర్ర సముద్రం)లో భారత్‌కి వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ నౌకపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి జరిపారు. ముడి చమురుతో ఉన్న ఈ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు అమెరికా మిలిటరీ ఈ రోజు వెల్లడించింది. ఎంవీ సాయిబాబా అనే ట్యాంకర్, గబన్ జెండాతో ఉంది. ఈ నౌకలో మొత్తం 25 మంది భారత సిబ్బంది ఉన్నారు. దాడిలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దాడి జరిగిన తర్వాత…
భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవర పెడుతుంది.
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్, ప్రపంచ నెంబర్-1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుమారు 7 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని డాక్టర్లు సూచించారు.
France: 300 మందికి పైగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఆదేశంలో నిలిపేసినట్లు శుక్రవారం తెలిపారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న విమానం ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో విమానాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రహస్య సమాచారం రావడంతో ఈ విమానాన్ని అధికారులు అడ్డుకున్నారు. యూఏఈ నుంచి ఈ విమానం బయలుదేరింది. దక్షిణ అమెరికాలోని నికరాగ్వాకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఇండియా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఆయన కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నారు.
భారత్‌లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి.
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నవాజ్, నాలుగోసారి పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని అనుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా యూకేలో ప్రవాసంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇటీవలే పాకిస్తాన్ తిరితగి వచ్చారు. తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) తరుపున ప్రచారం చేస్తున్నారు.
Black Tigers: భారతదేశంలో మొత్తం 10 నల్ల పులులు ఉన్నాయని, అన్నీ కూడా ఒడిశాలోని సిమిలిపాల్ లోనే ఉన్నట్లు ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కి తెలిపింది. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో మాత్రమే ‘‘మెలనిస్టిక్స్ టైగర్స్’’(బ్లాక్ టైగర్స్)ని నమోదు చేశామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభకు తెలిపారు.
Nawaz Sharif: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. అప్పుకోసం ప్రపంచదేశాలను, ఐఎంఎఫ్ చుట్టూ తిరుగుతోంది. ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు విద్యుత్, గ్యాస్, ఇంధన రేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో వచ్చ ఏడాది పాకిస్తాన్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణలతో ఇప్పటికే జైలులో ఉండగా.. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్…
Pakistan: పాకిస్తాన్ దేశంలో వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఉగ్రవాదిని పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపేసి అంతే వేగంతో మాయమవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు భారత వ్యతిరేక ఉగ్రవాదులు 19 మంది ఇలాగే చనిపోయారు. ఆదివారం రోజు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన కీలక ఉగ్రవాది హబీబుల్లాని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో కాల్చి చంపారు.