త్వరలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్.. టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన తర్వాత ఉండనుంది. అన్ని మ్యాచ్ లు హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరుగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ సిరీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్విట్టర్ లో తెలిపాడు.
Read Also: Kane Williamson: రికార్డు బద్దలు కొట్టనున్న కేన్ విలయమ్సన్.. వరుస సెంచరీలతో..!
అంతేకాకుండా.. ట్విట్టర్ లో ఇలా రాశాడు..’మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు’ అంటూ తవెంగ్వా తెలిపాడు.
Read Also: AP Politics: బీజేపీతో పొత్తుపై చర్చలు.. ఢిల్లీకి మొదట చంద్రబాబు, తర్వాత పవన్..!
కాగా.. జింబాబ్వేతో భారత్ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో విజయాలు సాధించింది. జింబాబ్వేతో టీమిండియా తొలిసారి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సందర్భంగా.. బీసీసీఐ సెక్రటరీ జైషా మాట్లాడుతూ.. జింబాబ్వే క్రికెట్‌ను పునర్నిర్మిస్తున్నందున ప్రపంచ క్రికెట్‌లో ఇది ఉత్తేజకరమైన దశ అని, దేశంలో క్రికెట్ వృద్ధికి తోడ్పాటునందించేందుకు భారత్ తనవంతు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.