WTC Points Table 2025 Latest: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఏకంగా ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు చేరింది. భారత జట్టు పాయింట్ల శాతం 54.16గా ఉంది. డబ్ల్యూటీసీ సైకిల్లో…
China Praises Modi: ప్రధాని నరేంద్రమోడీపై చైనా ప్రశంసలు కురిపించింది. మోడీ హయాంలో భారత్ ఆర్థిక, సామాజిక పాలన, విదేశాంగ విధానాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని చైనీస్ స్టేట్ మీడియా ఏజెన్సీ గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. అభివృద్ధి చెందడంలో భారత్ వ్యూహాత్మకంగా, నమ్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని తన ఆర్టికల్‌లో వ్యాఖ్యానించింది. షాంఘైలోని ఫుడాన్ యూనివర్శిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ రాసిన కథనాన్ని ప్రముఖ ప్రభుత్వ-చైనీస్ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది.…
ఇప్పటి వరకు ఏ ఆసియా జట్టు చేయలేని పనిని భారత జట్టు చేసింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కడంతో పాటు రోహిత్ శర్మ తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది.
ఇరాన్లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్‌లోని కెర్మాన్‌లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది.
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
భారత్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు రూ. 10319 కోట్ల మొత్తాన్ని వారు కొట్టేశారు. ఈ విషయాన్ని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.
తొలిసారి సఫారీ గడ్డపై సిరీస్ గెలిచేందుకు బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు మరో ఛాన్స్ వచ్చింది. మరోవైపు సొంతగడ్డపై జోరు మీదున్న సఫారీ జట్టు క్లీన్‌స్వీప్ చేసేందుకు రెడీ అవుతుంది.
Dr Saveera Parkash: డాక్టర్ సవీరా ప్రకాష్ పేరు ఇప్పుడు పాకిస్తాన్ లోనే కాదు ఇండియాలో కూడా ఫేమస్ అయింది. ఫిబ్రవరిలో పాకిస్తాన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా సవీరా ప్రకాష్ నిలిచారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన పాక్ వంటి దేశంలో ఓ హిందువు అదికూడా ఓ మహిళ ఎన్నికల బరిలో నిలబడటం చర్చనీయాంశంగా మారింది.
పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లు భారత్‌కు పెను ముప్పుగా మారుతున్నాయి. 2023లో భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థానీ డ్రోన్లను బీఎస్ఎఫ్ అధికారులు కూల్చివేసినట్లు ప్రకటించింది.
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ భారత గూఢచార సంస్థ RAWపై సంచలన ఆరోపణలు చేశారు. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తున్న వారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారు.