ప్రపంచం మొత్తానికి భారతదేశం అవసరం ఉంది.. దానికి అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే ఈ ప్రపంచం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులకు ముందే తెలుసన్నారు. అయితే, మహారాష్ట్రలోని పుణేలో జిల్లా అలండిలో అద్యాత్మిక గురువు శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ 75వ జయంతి సందర్భంగా గీతా భక్తి అమృత్ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
Read Also: Manakondur: మానకొండూరులో ఎలుగుబంటి కలకలం..
భారత్ తన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. ప్రస్తుత కాలంలో పురాతన గ్రంథం యొక్క అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాలం మారినప్పటికీ విజ్ఞానం యొక్క ప్రధాన భాగం అలాగే ఉంటుందన్నారు. అలాగే, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన వేడుకను సాహసేపేతమైన చర్యగా అభివర్ణించారు. భగవంతుని ఆశీర్వాదం వల్లే రామమందిర నిర్మాణం సాధ్యమైందన్నారు. 500 ఏళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత ఈ కల నెరవేరిందని చెప్పుకొచ్చారు. ‘భారత్ ఎంతో ఎత్తుకు ఎదగాలి.. అంతేగాక బలంగా ఉండాలని మోహన్ భగవత్ అన్నారు.