బ్రిటన్ లో చదువుకునే వారికి అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బ్రిటన్‌లో చదువుకునేందుకు భారత్‌తో పాటు విదేశాల నుంచి వెళ్లే విద్యార్థులు తమ బంధువులను తమ వెంట తీసుకెళ్లకూడదని చెప్పారు.
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్ ను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. 2023 నవంబర్ 1 నుంచి -30వ తేదీ మధ్య 71 లక్షల 96 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా తెలిపింది.
30వ విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవాళ్టి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఈ బాండ్లను ప్రవేశ పెట్టింది.
చైనా సరఫరా గొలుసు ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా భారత దేశం నిలవడం ఈ ప్రపంచానికి అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. 2024లో మనకు లభించే గొప్ప అవకాశం ఇదే అని అన్నారు.
న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ దేశంలో పెద్దనగరమైన ఆక్లాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కివీస్ ప్రజలు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్, ఫైర్వర్క్స్ షో అబ్బురపరిచాయి.
కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం టీమిండియా కసరత్తు ప్రారంభించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్ట్ లో విజయం సాధించాలనే ఉద్దేశంతో టీమ్ రంగంలోకి దిగనుంది. ఇదిలా ఉంటే.. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో భారత్ రికార్డు బాగోలేదు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలవలేదు.
సుకన్య సమృద్ధి యోజన, ప్రభుత్వ పొదుపు పథకం "బేటీ బచావో, బేటీ పడావో" చొరవలో కీలకమైన భాగం. ఆడపిల్లల ఉద్ధరణ, సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఖతార్ కోర్టు భారత మాజీ నేవీ సిబ్బంది మరణశిక్షను తగ్గించిన తర్వాత, ప్రభుత్వం ఈ కేసులో పెద్ద అప్డేట్ ఇచ్చింది. దీనిపై న్యాయ బృందంతో చర్చిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
చలికాలం వచ్చేసింది.. రోజూ రోజుకు చలి పెరుగుతూనే ఉంది కానీ తగ్గింది లేదు.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లాలంటే జనాలు భయంతో గజగజా వణికిపోతున్నారు.. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది.. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక ఈరోజు రేపు భారీగా పొగ మంచు ఏర్పడే…
సెంచురియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాపై ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. డీన్ ఎల్గార్ (185) సెంచరీ చేయగా.. మార్కో యన్సెన్ (84 నాటౌట్), డేవిడ్ బెడింగ్ హామ్ (56) అర్ధసెంచరీలతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు.