పాకిస్తాన్ మూడు వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దులో భారతదేశంతో శత్రుత్వంతో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబాన్ ఉత్తర సరిహద్దులో ఆయుధాలతో నిలబడి ఉంది. ఈశాన్య సరిహద్దులో ఇరాన్‌తో పాకిస్థాన్ శత్రుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో భారత జాతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అరెస్ట్ చేసింది. అమెరికా అధికారుల సూచన మేరకు గతేడాది నవంబర్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే నిందితుడికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా గడ్డపై అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నడాన్ని అమెరికా…
హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్లోఅంతర్భాభాగ మేనని అగ్రరాజ్య అమెరికా మరో సారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని తెలిపింది.
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా నార్డిక్ దేశాలు (ఉత్తర ఐరోపా, అట్లాంటిక్ దేశాలు) అత్యధిక స్కోర్లతో సంతోషకరమైన దేశాలలో ఉన్నాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది.
India Growth: ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉంటే భారత్ మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత వృద్ధి 8 శాతం ఉంటుందని అంచనా వేశాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కూడా ఇదే విషయాన్ని చెప్పింది. భారతదేశం 8 శాతం వార్షిక జీడీపీ వృద్ధిని కొనసాగించగలదని సెంట్రల్ బ్యాంక్ మార్చి బులెటిన్‌లో ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ కథనంలో పేర్కొంది. 2021-24 కాలంలో, స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి సగటున…
Vinay Kumar: రష్యాలో భారత రాయబారిగా వినయ్ కుమార్‌ని నియమించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) తెలియజేసింది. ప్రస్తుతం మయన్మార్‌లో భారత రాయబారిగా ఉన్న 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్, త్వరలోనే తన బాధ్యతలు చేపడుతారని ఎంఈఏ తెలియజేసింది. ఇటీవల రష్యాలో ఎన్నికలు జరిగాయి, మరోసారి పుతిన్ భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది.
Supreme Court:కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఏఏపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు 3 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సీఏఏని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 237 పిటిషన్లు దాఖలయ్యాయి.
మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. అత్యంత కాలుష్య రాజధానిలలో ఒకటిగా మరోసారి లిస్ట్ లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిలలో మరోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను తాజాగా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారంగా చూస్తే మనదేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాల్గవసారి ఎంపికైంది. Also Read: RRB…
మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భారత్, శ్రీలంక,మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది.