అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారతీయ- అమెరికన్ల బృందం న్యాయ శాఖతో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ), పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు అమెరికా మట్టిని ఉపయోగిస్తోందని చెప్పారు. కాలిఫోర్నియాలో హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసుల సీనియర్ అధికారులతో ఈ బృందం సమావేశమైంది.
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
2021లో జరగాల్సిన జనగణన కరోనా నేపథ్యంలో నిలిచిపోయింది. ఇప్పటికే జనాభాలో భారత్ చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కాకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇదే సమయంలో బ్లూమ్ బర్గ్ వర్గాలు జనగణన పై కొన్ని కీలక విషయాలను ప్రకటించాయి. అతిత్వరలో జరగబోనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాతనే జనగణన ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆర్థిక డేటా నాణ్యతను అప్ గ్రేడ్ చేసే మార్గాలను చర్చిస్తోందని వెల్లడించింది.…
: భారత్‌పై ప్రమాదకర ప్రణాళికలు రచిస్తున్న చైనా.. ఇప్పుడు భారత్ చుట్టూ పక్క దేశాల్లో సైనిక స్థావరాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌కు పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, చైనా, క్యూబా, స్నేహపూర్వక దేశమైన యూఏఈ, సీషెల్స్, తజికిస్థాన్, టాంజానియా వంటి దేశాలు కూడా సైనిక స్థావరాలను నిర్మించే అవకాశాలపై కసరత్తు చేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తాజా నివేదిక వెల్లడించింది.
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత్ తీసుకువచ్చిన సీఏఏ సమానత్వం, మతపరమైన వివక్షత, భారతదేశ అంతర్జాతీయ మానవహక్కుల బాధ్యతలకు అసంబద్ధమని, రాజ్యాంగ విలువలకు దెబ్బగా అభివర్ణించింది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని,
మనం మాములుగా తత్కాల్ టికెట్ గురించి అందరము వినే ఉంటాము. ముక్యంగా పండగల సమయంలో ఈ మాట బాగా వింటాము. అయితే మీరెప్పుడైనా తత్కాల్ పాస్ పోర్ట్ గురించి విన్నారా..? నిజానికి అలాంటి ఓ పాస్ పోర్ట్ ఉంటుందనే విషయం కూడా మీకు తెలుసా..? ఇంతకీ ఈ తత్కాల్ పాస్ పోర్ట్ ఏమిటి..? ఇది పొందడానికి ఎలా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలోన్న విషయాలు ఇప్పుడు ఓసారి చూద్దాం. మనం కొన్ని అత్యవసర సమయాల్లో లేక…
Hardeep Nijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదానికి కారమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం మరింత ఎక్కువైంది. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలు చేసిన కెనడాకు మిత్ర పక్షం న్యూజిలాండ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
China: మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తాము మద్దతు ఇస్తున్నామని చైనా మంగళవారం ప్రకటించింది. ఫస్ట్ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది మాల్దీవులను విడిచిపెట్టింది. వారి స్థానంలో పౌరసిబ్బందిని నియమించింది. హెలికాప్టర్ సేవల్ని నిర్వహిస్తున్న భారత సైన్యం దేశాన్ని విడిచిపెట్టినట్లు మాల్దీవుల మీడియా సోమవారం తెలిపింది.
Danish Kaneria: పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ డానిష్ కనేరియా భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు మద్దతు తెలిపారు. 2015కి ముందు భారత్‌కి తరలివెళ్లిన శరణార్థులకు సంబంధించి, సీఏఏ నిబంధనలు పాకిస్తానీ హిందువులందరికీ మంచివని కనేరియా ప్రశంసించారు. పాకిస్తానీ హిందువులు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకోగలుగుతారు అని కనేరియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సీఏఏని అమలు చేసినందుకు భారత ప్రధాని నరేంద్రమోడీకి, హోమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.