Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్: శ్రీలీల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh: ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఎస్.తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ చిత్రం ఉగాది కానుగా మార్చి 19వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
READ ALSO: SaiPallavi: భన్సాలీ కన్ను సాయిపల్లవిపైనే.. ఆ లెజెండరీ బయోపిక్ సెట్ అయినట్లేనా!
Also Read
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. “హరీష్ శంకర్ గారు నిజాయితీగా పని చేస్తారు. అందుకే అంత ముక్కుసూటిగా ఉంటారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. హరీష్ శంకర్ గారు సరిగా నిద్ర కూడా పోకుండా ఒక యజ్ఞంలా ఈ సినిమా పూర్తి చేశారు. ఆ యజ్ఞం ఫలించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారికి కృతఙ్ఞతలు. ప్రతి చిన్న విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టి, ఈ సినిమా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన పాటలు అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మా హీరో పవన్ కళ్యాణ్ గారు.. పవర్ స్టార్, పీపుల్ స్టార్. ఆయన గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు నేను. నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నా అని తెలిసి.. తమిళ, కన్నడ ఇలా సినిమా సెట్ కి వెళ్ళినా పవన్ గారి గురించి అడిగేవారు. ఆయనను చూసి చాలా చాలా నేర్చుకున్నాను. పాజిటివ్ గా ఉండటం, మన జీవితం మనం చూసుకోవడం కాకుండా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ప్రకృతిని ప్రేమించడం.. ఇలా ఎన్నో నేర్చుకున్నాను. పవన్ గారు సినిమాలు చేయడం అనేది సినిమాకి మంచింది. ఎందరికో ఆయన నిజమైన స్ఫూర్తి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని ఉస్తాద్ ఉగాది చేస్తారని కోరుకుంటున్నాను. మార్చి 19న థియేటర్లలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం.” అన్నారు.
READ ALSO: Ustaad Bhagat Singh: “అన్నయ్య పక్కన ఉంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను” – పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?