Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్, భారత్తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చూస్తోంది. 2019లో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా భారత్తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను నిలిపేసుకుంటున్నట్లు ప్రకటించింది.
Onion exports: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిరవధికంగా నిషేధాన్ని పొడగించింది. ఈ పరిణామం పలు అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరల్ని ప్రేరేపించనుంది.
అధిక ఇంధన ధరలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. రెండేళ్ల సూచన వ్యవధిలో ఇంధన ధరలు తగ్గిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం అని అన్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పూరీ మాట్లాడారు.
పాకిస్థాన్ ఒక పరిశ్రమగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సమస్యను విస్మరించడానికి భారత్ ఏమాత్రం అనుకూలంగా లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు
Moscow terror attack: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భారత సరిహద్దు దేశం భూటాన్ వెళ్లారు. శుక్రవారం మోడీ బిజిబిజీగా గడిపారు. అక్కడ ప్రభుత్వ పెద్దలతో మోడీ సమావేశం అయి పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.
Maldives: మాల్దీవులకు విషయం బోధపడినట్లుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశం, చైనా అండ చూసుకుని భారత వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ప్రెసిడెంట్గా ఎన్నిక కావడంతోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించాడు.
హోలీ భారతదేశంలోని పెద్ద, ప్రసిద్ధ పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా చోట్ల దీని ఆదరణ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మన దేశంలో హోలీ పండుగను జరుపుకోని చాలా ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్కు వెళ్లారు. ఇవాళ (శుక్రవారం) ఉదయాన్నే ప్రధాని మోడీ భూటాన్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో బయలు దేరారు.