నిరుద్యోగులే పెట్టుబడిగా దేశ వ్యాప్తంగా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో దేశంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు.
క్రికెట్ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్ కేరీర్ మలుపు తిరిగిన రోజు ఈరోజే (మార్చి 27, 1994). ముప్పేళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్ దేవుడిగా అవతరించాడు. టీమిండియా న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. ఇండియా రెగ్యూలర్ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆ మ్యాచ్ కు దూరమయ్యాడు. అంతలో కెప్టెన్ అజారుద్దీన్.. ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలని సచిన్ టెండుల్కర్ కు చెప్పాడు. దీంతో.. ఆ పిలుపే సచిన్ కెరీర్ ను మలుపు తిప్పింది.
Jaishankar: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా దుందుడుకు వేషాలు ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతంలో సర్వాధికారాలు మావే అంటూ ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను చైనా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల రెండు సందర్భాల్లో ఫిలిప్పీన్స్ నౌకలపై చైనా కోస్టుగార్డ్స్ నౌకలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతంతో మిత్రదేశం ఫిలిప్పీన్స్‌కి అండగా నిలుస్తామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. చైనా వైఖరిని…
Youtube: యూట్యూబ్ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఇండియాలో ఏకంగా 2.25 మిలియన్ల(22,54,902) వీడియోలను తొలగించింది.
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేసింది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా మారింది. మొదటి టెస్ట్ పెర్త్ వేదికగానే జరుగనుంది. ఈ సిరీస్ ను పెర్త్ లో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి…
ఆసియా బిలియనీర్ క్యాపిటల్‌గా తొలిసారి భారత ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ముంబైలో మొత్తం 92 మంది బిలియనీర్లు మాత్రమే ఉండగా.. ఈ సంఖ్య బీజింగ్‌లో 91గా ఉంది.
పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్‌తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది.
PoK: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని ప్రజలే భారత్‌లో విలీనం కావాలనే డిమాండ్‌ని లేవనెత్తతున్నారని అన్నారు. పీఓకే భారత్‌లో విలీనం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.