India-Russia: ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ కేసులో భారత్‌కు రష్యా అండగా నిలిచింది. అమెరికా వాదనలను మాస్కో తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా ‘భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని’ ఆరోపించింది. గత ఏడాది నవంబర్‌లో అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాపై అభియోగాలు మోపింది. ఇటీవల, వాషింగ్టన్ పోస్ట్ నివేదికలో పన్నున్ హత్యకు కుట్రలో రా అధికారి ప్రమేయం ఉందని పేర్కొంది.
Read Also: Daggubati Purandeswari: బొత్సకు పురంధేశ్వరి కౌంటర్..
భారత్ అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యత చేసేందుకు అమెరికా ఇప్పుడు ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. ‘వాషింగ్టన్‌లో భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్రపై సాధారణ అవగాహన లేదన్నారు. ఎందుకంటే మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోంది అన్నారు. అమెరికా కార్యకలాపాలు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొనింది. అలాగే, భారతదేశంతో పాటు ఇతర దేశాలపై కూడా అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తుండటంపై రష్యా అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Salman Khan Case: కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్
గురుపత్వంత్ సింగ్ పన్నూని చంపడానికి విఫలమైన పథకంలో గుప్తా ప్రమేయం ఉందని రష్యా ఆరోపించారు. ఇక, పన్నున్ అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడు.. కాగా, వాషింగ్టన్ పోస్ట్‌లోని మూలాలను ఉటంకిస్తూ.. పన్నున్ చంపడానికి ఆరోపించిన కుట్రలో RAW అధికారులు ప్రమేయం ఉన్నారని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, రా అధికారి విక్రమ్ యాదవ్ ప్లాన్ కోసం హిట్ టీమ్‌ను సిద్ధం చేశారని నివేదికలో వెల్లడించింది. ఇక, ఈ ఆరోపణలపై భారత్ ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. వారంలోనే ఈ అంశంపై భారత దర్యాప్తు ఫలితాల కోసం వేచి ఉన్నామని అమెరికా తెలిపింది.