SaiPallavi: భన్సాలీ కన్ను సాయిపల్లవిపైనే.. ఆ లెజెండరీ బయోపిక్ సెట్ అయినట్లేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SaiPallavi: వైవిధ్యమైన పాత్రలు, సహజసిద్ధమైన నటనతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘నేచురల్ బ్యూటీ’ సాయిపల్లవి. లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్న లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌లో సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
READ ALSO: Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
Also Read
గతంలో ఈ పాత్ర కోసం కియారా అడ్వాణీ, అనీత్ పడ్డా వంటి పేర్లు వినిపించినప్పటికీ, చివరికి భన్సాలీ బృందం సాయిపల్లవినే ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్‌లో జునైద్ ఖాన్‌తో కలిసి నటించిన ‘ఏక్ దిన్’ సినిమాతో త్వరలోనే ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం మే 1, 2026న విడుదల కానుంది. ప్రస్తుతం సాయిపల్లవి రణబీర్ కపూర్‌తో కలిసి ‘రామాయణ’ చిత్రంలో సీతగా నటిస్తోంది. దీనితో పాటు ధనుష్‌తో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ బయోపిక్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ‘పద్మావత్’, ‘గంగూబాయి కాఠియావాడి’ వంటి చిత్రాలతో మహిళా పాత్రలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన భన్సాలీ, మధుబాల బయోపిక్‌ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సాయిపల్లవి నటిస్తే, అది ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడం ఖాయం అని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Ustaad Bhagat Singh: “అన్నయ్య పక్కన ఉంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను” – పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!