India Maldives Tension: గత కొంతకాలంగా భారత్ తో మాల్దీవుల సంబంధాలు ఏమాత్రం సజావుగా సాగడం లేదు. ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యాటనతో ఇరుదేశాల మధ్య విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే, ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు చెందిన పీఎన్సీ పార్టీ మరోసారి విజయం సాధించాక పరిస్థితిలో కొంత సానుకూల మార్పు కనపడుతుంది.
Read Also: Ashu Reddy: పేరు మార్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఇప్పుడన్నా కలిసోస్తుందా?
ఇక, భారత పర్యాటకులు తమ దేశానికి రావాలంటూ మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఫైజల్ విజ్ఞప్తి చేశారు. అయితే, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ నేడు (మే 9) భారత్ పర్యటనకు వస్తున్నారు. మహ్మద్ ముయిజ్జూ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఓ మాల్దీవుల మంత్రి భారత్ లో ఉన్నతస్థాయి పర్యటనకు రావడం ఇదే తొలిసారి. మాల్దీవుల మంత్రి మూసా జమీర్ ఇవాళ భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో సమావేశం కానున్నారు. ప్రాంతీయ అంశాలు, పరస్పర సహకారం లాంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ముందడుగు వంటిదని పేర్కొంది.
Read Also: Devara : ‘దేవర’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా..?
అలాగే, మాల్దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని మహ్మద్ ముయిజ్జూ ఆదేశించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యంలో చాలా భాగం వెనక్కి వచ్చేసింది.. తమ దేశం నుంచి మే 10వ తేదీ లోపు భారత బలగాలు పూర్తిగా వెళ్లిపోవాలంటూ ఇటివలే ప్రెసిడెంట్ ముయిజ్జూ డెడ్ లైన్ పెట్టాడు.