ఈ సంవత్సరం భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చలి ఎక్కువుగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలలో ఎముకలు కొరికేంత చలి ఉండనుంది. ఇందుకు కారణం ‘లా నినా’. పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. లా నినా కారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చలి ఎక్కువుగా కొనసాగే అవకాశం ఉంది. లా నినా పరిస్థితులు ప్రపంచ వాతావరణ నమూనాలను…
* నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం.. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ గువాహటిలో నేటి నుంచి ఆరంభం.. తొలి మ్యాచ్‌లో శ్రీలంక- భారత్ ఢీ * చెన్నై: తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన హీరో విజయ్ టీవీకే పార్టీ.. పోలీసుల లాఠీఛార్జ్, కుట్ర వల్లే తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీవీకే పిటిషన్.. నేడు టీవీకే పిటిషన్‌పై విచారణ జరుపనున్న హైకోర్టులోని మధురై బెంచ్. *…
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ పాక్ పై విజయ దుంధుబి మోగించిన తర్వాత టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్, ఆ దేశ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో నఖ్వీ అంతర్జాతీయ వేదికపై అవమానాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు భారత్ క్రీడా స్ఫూర్తిని అవమానించిందని ఆరోపిస్తున్నారు. ఆట తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందన పోస్ట్‌పై మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్లో నఖ్వీ స్పందించారు. మోడీపై…
Natural gas: భారత్ జాక్‌పాట్ కొట్టింది. దేశంలో మొదటిసారిగా అండమాన్ సముద్రంలో ‘‘సహజ వాయువు’’ నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్‌ను కనుగొంది. ప్రారంభ టెస్టుల్లో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలింది. గతంలో ఈ ప్రాంతంతో సంభావ్య చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను, ఇంధన మార్కెట్‌ను గణనీయంగా మారస్తుంది.
India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.