* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు.. కుటుంబ సభ్యులతో సహా హాజరుకానున్న డీఎస్సీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులు * ఈ నెల 30 వరకు తెలంగాణకు భారీ వర్ష సూచన.. రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం.. * ఇవాళ ఢిల్లీలో డీసీసీ పరిశీలకుల నియామక ప్రక్రియలపై దిశానిర్దేశం.. తెలంగాణ డీసీసీ నియామకాల కోసం…
కడప మేయర్‌పై అనర్హత వేటు.. కార్పొరేషన్‌కు చేరిన ఉత్తర్వులు.. కడప మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కడప మేయర్ సురేష్ బాబుపై వేటుపడటం పొలిటికల్‌గా దుమారం రేపుతోంది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించాడని విజిలెన్స్ విచారణలో తేలింది. వర్ధిని సంస్థలో కొత్తమద్ది అమరేష్, కొత్తమద్ది జయశ్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నారని తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 క్లాసెస్ 22 (1) ప్రకారం మేయర్ నేరుగా గాని,…
దాయాది దేశం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ వేదికగా భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని.. సొంత ప్రజలనే బాంబులతో చంపేస్తోందని భారత్ విమర్శించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి ప్రసగించారు.
టారిఫ్ ఉద్రిక్తతల వేళ భారత్-అమెరికా మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం శుభపరిణామంగా భావించొచ్చు.