Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తను ఎదగడమే కాదు.. తన శిష్యుల్ని దర్శకులుగా మార్చి వాళ్లకు ఓ బ్యాన్ బోన్‌లా మారారు సుకుమార్. కథ, కంటెంట్ బాగుంటే సొంతంగా సినిమాలు తీసేందుకు ప్రోత్సహాన్ని అందించడమే కాదు.. తాను నిర్మాతగా మారి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దగ్గర దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుని తమకంటూ ఓన్ పాథ్ ఏర్పాటు చేసుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో సుక్కు దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన బుచ్చిబాబు ఉప్పెనతో దర్శకుడిగా మారి ఫ్రూవ్ చేసుకున్నాడు. నెక్ట్స్ రామ్ చరణ్‌తో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిని తెరకెక్కిస్తున్నాడు. బుచ్చి మేకింగ్ అండ్ టేకింగ్‌లో అక్కడక్కడా సుకుమార్‌ను గుర్తు చేస్తుంటాడు. ఏప్రిల్ 30న సెకండ్ టెస్ట్‌కు రెడీ అవుతోన్నాడు ఈ యంగ్ డైరెక్టర్.
Also Read : Ramayana vs Varanasi : మహేశ్ vs రణబీర్.. రాముడిగా ఎవరు పర్ఫెక్ట్…?
Also Read
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
సుకు మరో శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఫస్ట్ ఫిల్మ్ భం భం బోలేనాథ్ బెడిసి కొట్టినా.. సెకండ్ ఫిల్మ్ విరూపాక్షతో క్లిక్ అయ్యాడు. బ్లాక్ మ్యాజిక్ లాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో వావ్ అనిపించాడు. నెక్ట్స్ మరింత బిగ్గర్ ఫిల్మ్ చేస్తున్నాడు. నాగ చైతన్యతో మిథాలజీ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్‌తో వృషకర్మ చేస్తున్నాడు. తాజాగా వదిలిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించడమే కాదు.. మూవీపై అంచనాలు పెంచేశాయి. రంగస్థలం, నాన్నకు ప్రేమతో సుకుమార్ దగ్గర వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల దసరాతో మాస్ దర్శకుడిగా మారాడు. నాని కెరీర్‌లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీని అందించిన శ్రీకాంత్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు న్యాచురల్ స్టార్. ప్యారడైజ్‌లో నానిని మరింత రా అండ్ రస్టిక్‌గా చూపించబోతున్నాడు దర్శకుడు. ఆగస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీళ్లే కాదు.. కుమారి 21 ఎఫ్, 18 పేజెస్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్, తాజాగా రిలీజైన శ్రీ విష్ణు థ్రిల్లర్ ఫిల్మ్ మృత్యుంజయ్ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ కూడా సుకుమార్ శిష్యులు. సుకుమార్ దగ్గర పాఠాలు నేర్చుకుని.. దర్శకులుగా ఫ్రూవ్ చేసుకుంటుంటే.. వారికి అవసరమైన హెల్ప్ చేస్తూ సపోర్టివ్ సిస్టమ్‌గా మారాడు ఈ లెక్కల మాస్టార్. ఈ ఏడాది సుకుమార్ రాకపోయినా.. ఆయన శిష్యులు బాక్సాఫీస్‌ను షేక్ చేసేలానే ఉన్నారు.
తాజావార్తలు
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!