అందెశ్రీ మృతిపై ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి.. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారు.. కవి, రచయిత అందెశ్రీ కన్నుమూయడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. అందెశ్రీ మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. “ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది.. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు…
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలపై ఫోకస్.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ…
వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉండబోతోంది..? 2017లో ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసి 2019లో 151 సీట్లతో అధికారం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. 2027లో పాదయాత్ర 2.0 కూడా వైసీపీకి పునరుజ్జీవన శక్తిగా మారనుందని నేతలు విశ్వసిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని 2027 జగన్ పాదయాత్ర 2.0 ఉంటుందని తాజాగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు…
Mini Countryman SE All4: భారత మార్కెట్లోకి మినీ కంట్రీమ్యాన్ SE All4 ఎలక్ట్రిక్ SUVవి కారు వచ్చేసింది.. రూ. 66.90 లక్షల (ఎక్స్–షోరూమ్) ప్రారంభ ధరతో దీనిని విడుదల చేశారు.. JCW థీమ్ వేరియంట్లో లభించే ఈ మోడల్‌కి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వాహనం CBU (Completely Built Unit) రూపంలో దిగుమతి అవుతుంది, డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2025 కంట్రీమ్యాన్ SE All4 కొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. రీడిజైన్ చేసిన గ్రిల్,…
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. కోబ్రీ సమీపంలో గురువారం ఐదుగురు భారతీయ కార్మికులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారని భద్రతా వర్గాలు తెలిపాయి. కార్మికులు విద్యుత్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇక కిడ్నాప్ వార్తలను కంపెనీ కూడా ధృవీకరించింది.
పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తాజాగా స్పందించారు. భారతదేశం భయంతో ఏ అడుగు వేయదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వండన్నారు.
రష్యాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ మేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విద్యార్థి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
ప్రధాని మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని.. అలాగే మంచి స్నేహితుడు అంటూ కొనియాడారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.