LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం..?
- ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు
- ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు
- ఎస్మా ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్‌లో తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. దేశంలో ఎల్‌పీజీ కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అధికారాలను వినియోగిస్తూ దేశంలోని ఆయిల్ రిఫైనరీలకు ఎల్‌పీజీ ఉత్పత్తిని వెంటనే పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించింది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసింది. గ్యాస్ సరఫరా అంతరాయం కారణంగా కొన్ని రాష్ట్రాల్లో హోటళ్లు, ఆహార వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: War Effects: ముంబై, చెన్నైలో గ్యాస్ సంక్షోభం.. మూతపడ్డ పలు హోటల్స్
Also Read
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
- BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
అధికారుల వివరాల ప్రకారం.. వాణిజ్య, గృహ అవసరాల కోసం ఎల్‌పీజీపై డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రిఫైనరీలు ఉత్పత్తిని పెంచాలని కేంద్రం స్పష్టం చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అత్యవసర సేవలను నిరంతరం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ చట్టం కింద అవసరమైన సేవలను అందించే సంస్థలు తమ కార్యకలాపాలను ఆపకుండా కొనసాగించాల్సి ఉంటుంది. గ్యాస్ సరఫరా కూడా ప్రజల దైనందిన జీవితానికి కీలకమైనదిగా భావించి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: భారీ ఝలక్ ఇచ్చిన వెండి, బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
ఇకపోతే ఇటీవల కొన్ని నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్ పరిశ్రమ తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. సరఫరా అంతరాయం వల్ల అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కేంద్రం ఉత్పత్తి పెంపుతో పాటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలోనే తగ్గుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Government of India invokes the Essential Commodities Act, 1955, to regulate the availability, supply and equitable distribution of petroleum and petroleum products and natural gas pic.twitter.com/OqtsDwb13s
— ANI (@ANI) March 10, 2026
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?