భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. దశాబ్ద కాలం నాటి రక్షణ చట్టానికి భారతదేశం అమెరికా సంతకం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా, జపాన్లో పర్యటించారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొగుడుతున్నారో.. తిడుతున్నారో తెలియకుండా చాలా నర్మగర్భంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.