పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కీలక అనుచరుడైన కొమ్మా కోట్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ–2 నిందితుడిగా ఉన్న కోట్లును పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా కోట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, అతని కోసం పోలీసులు గాలింపు కొనసాగించారు. చివరకు అతడు బస చేసిన ప్రదేశంపై ఖచ్చితమైన సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకున్నాయి.. అదే సమయంలో, గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోట్లు నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ రెండు కేసుల్లో అతని ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. పోలీసులు నేడు కోట్లు అరెస్టును అధికారికంగా నమోదు చేసి, కేసు వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం. కాగా, సత్యవర్ధన్‌ను బెదరించడం, కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత పలు కేసులను ఎదుర్కొన్నారు.. అనారోగ్యంతో.. జైలులోనే అవస్థలు పడ్డారు.. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన విషయం విదితమే..
స్టీల్ ప్లాంట్‌లో మరో ఉద్యమం.. ఆర్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ఉద్యమం ప్రారంభమైంది.. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్’ కార్యక్రమం ఉధృతంగా మారింది. ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే వారి భూములు తిరిగి ఇవ్వాలని నిర్వాసితులు స్పష్టమైన డిమాండ్లతో ఆందోళనకు దిగారు.. నిరసనలో పాల్గొన్న నిర్వాసితులు భారీ సంఖ్యలో ప్లాంట్ మెయిన్ గేటుకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో స్టీల్ ప్లాంట్‌కి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. ఉద్యోగులు విధులకు వెళ్లకుండా వాహనాలను ఆపి నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసులు, నిర్వాసితుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైలెన్స్‌కు పాల్పడవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో నిర్వాసితులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. “మా న్యాయమైన హక్కులు నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదు” అని వారు ప్రకటించారు. భూములు ఇచ్చి నలభై ఏళ్లకు పైగా గడిచినా, వాగ్దానం చేసిన ఉద్యోగాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆవేదన మరోసారి స్టీల్ ప్లాంట్ గేటు వద్ద హోరెత్తింది.
గంగవరం పోర్టు దగ్గర టెన్షన్.. టెన్షన్..
విశాఖపట్నం గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వ్యవహారశైలికి నిరసనగా నిర్వాసిత కార్మికులు పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. గతంలో వన్ టైం సెటిల్‌మంట్ కింద కార్మికులతో చేసిన ఒప్పందం నెరవేర్చకపోవడమే ఈ ఆందోళనకు కారణమైంది. సెటిల్‌మెంట్ ఒప్పందం ఉల్లంఘనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నిర్వాసిత ఉద్యోగులకు వన్ టైం సెటిల్‌మెంట్‌గా రూ.27 లక్షలు చెల్లించేందుకు పోర్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. 60 రోజుల్లో మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పందం కుదిరినప్పటికీ, ఇప్పటి వరకు కార్మికులకు కేవలం రూ.4 లక్షలు 80 వేలే చెల్లించినట్లు సమాచారం. తమకు రావాల్సిన మరో రూ.2 లక్షలు 30 వేల చెల్లింపును ఇన్‌కామ్ టాక్స్ పేరుతో నిలిపివేసి కాలయాపన చేయడం కార్మికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పెండింగ్‌లో ఉన్న రూ.2,30,000 వెంటనే విడుదల చేయాలని కార్మికుల ప్రధాన డిమాండ్‌గా ఉంది.. అదే సమయంలో ఆందోళన చేస్తున్న కార్మికులు, కమిటీ సభ్యులపై ఉన్న పోలీస్ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యంతో ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు వేతనాలు, సెటిల్‌మెంట్ పేరుతో ఇలా వేధించడం సరైంది కాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పోర్టు యాజమాన్యం తక్షణం సమస్యను పరిష్కరించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. గంగవరం పోర్టులో పరిస్థితి ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్‌లోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్ష ఫీజు గడువును మరోసారి పొడిగించింది SSC బోర్డు.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.. లేట్ ఫీతో మరికొన్ని అవకాశాలు కల్పించింది బోర్డు.. రూ.50 లేట్ ఫీతో – 12వ తేదీ వరకు అవకాశం.. రూ.200 లేట్ ఫీతో – 15వ తేదీ వరకు చెల్లింపు.. రూ.500 లేట్ ఫీతో – 18వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు..
నగరంలో రియల్టర్ దారుణ హత్య.. నడిరోడ్డుపై కత్తితో నరికి, కాల్చి చంపిన దుండగులు..
నగరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య కలకలం సృష్టించింది.. ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు దుండగులు వెంకటరత్నం(50) అనే రియల్టర్‌ను నడిరోడ్డుపై షూట్ చేసి చంపారు. కాల్పులు జరిపి కత్తులతో నరికి హత్య చేశారు.. పాపను స్కూల్లో దించి స్కూటర్ పై తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్‌తో పాటు కత్తులు స్వాధీనం
‘ఇండిగో సంక్షోభం’ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఝలక్
ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్‌మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా… సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండిగో సంక్షోభాన్ని అత్యవసరంగా విచారించలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది తీవ్రమైన సమస్యేనని.. లక్షలాది మంది బాధితులు ఉన్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ శనివారం పిటిషన్ దాఖలైంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని.. చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని కోరారు. పౌర విమానయాన శాఖ, డీజీసీఏలు స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని… తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. తాజాగా అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
వందేమాతరం కేవలం పాట కాదు.. భారత దిక్సూచి
వందేమాతరం కేవలం పాట కాదని.. ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వందేమాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ.. వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇక ఈ పాట 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని తెలిపారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ వందేమాతరం పాటతో బ్రిటిష్ వారిని సవాలు చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం దేశానికి స్ఫూర్తినిచ్చి.. సాధికారతను కల్పించిందని స్పష్టం చేశారు. ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనే చేపట్టినట్లు పేర్కొన్నారు. ‘‘వందేమాతరం గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులకు ధన్యవాదాలు.. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మందికి స్ఫూర్తి నింపిన వందేమాతర గీతంపై చర్చ జరపడం మనందరి అదృష్టం. ఈ చర్చ.. చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుంది.. ఈ మధ్యే మనం రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకున్నాం.. 150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లింది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తొలి ‘AI ఫోన్’ వచ్చేస్తోంది! డిస్ప్లేను టచ్ చేయకుండానే పనిచేసే ఫీచర్లు..
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. తాజాగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఇటీవల “AI ఫోన్” నమూనాను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మానవుడిలా పనిచేయడానికి దగ్గరి పోలిక కలిగి ఉంది. అయితే ఈ డెవలప్ మెంట్ ను చాలా మంది ప్రమాదకరమైనదిగా అభివర్ణిస్తున్నారు. బైట్‌డాన్స్ తన డౌబావో AI ఏజెంట్‌ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల మొబైల్ స్క్రీన్‌లను పరిశీలిస్తుంది. కంట్రోల్ చేస్తుంది. ఈ ఏజెంట్లు ఎటువంటి మానవ స్పర్శ లేకుండా యాప్‌లను ఓపెన్ చేస్తాయి. యూజర్లకు ఆర్డర్‌లను కూడా ఇస్తాయి. “AI ఫోన్” కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్ లు పంపడానికి, టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. షెన్‌జెన్‌కు చెందిన వ్యాపారవేత్త టేలర్ ఓగన్ AI ఫోన్‌ను ప్రదర్శించే వీడియో వైరల్‌గా మారింది. అతను AI ఫోన్‌కు వాయిస్ కమాండ్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిక్ గా ఆ పనిని పూర్తి చేస్తుంది. నివేదికల ప్రకారం, బైట్‌డాన్స్ త్వరలో దాని AI ఫోన్‌ల ఫీచర్లను తగ్గించనుంది. తద్వారా అవి సున్నితమైన డేటాను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. అయితే, ఇది కమర్షియల్ గా ఎప్పుడు ప్రారంభించబడుతుందనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
ఐఫోన్ యూజర్స్కి అలర్ట్.. గూగుల్- క్రోమ్లని ఉపయోగించొద్దని ఆపిల్ హెచ్చరిక
ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్- క్రోమ్ బ్రౌజర్‌ను వాడటం మానేయాలని సూచించింది. క్రోమ్‌తో పోలిస్తే సఫారి మీ గోప్యతను నిజంగా కాపాడుతుందని తెలియజేసింది. ప్రకటనలు, వెబ్‌సైట్లు డిజిటల్ ఫింగర్‌ప్రింట్ సృష్టించి వినియోగదారులను ట్రాక్ చేయకుండా ఉండేందుకు సఫారీ ఉపయోగపడుతుంది. అలాగే, మీ డివైస్‌కు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను కలిపి ఒక డిజిటల్ ఫింగర్‌ప్రింట్ సృష్టించి, మీ ఆన్‌లైన్ కదలికలను ట్రాక్ చేయకుండా ఉండేందుకు సఫారి రక్షణగా నిలుస్తుందని ఆపిల్ సూచించింది. మీరు ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తుంటే, మీ మొబైల్/ కంప్యూటర్ గురించి చిన్న చిన్న సమాచారాలు మీకు తెలియకుండా లీక్ అవుతాయి. బ్రౌజర్ టైప్, ఇన్‌స్టాల్ చేసిన ఫాంట్లు, ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్‌వేర్ వివరాలు అన్నీ కలిపి ఒక ప్రత్యేక డిజిటల్ ఫింగర్‌ప్రింట్ రూపొందిస్తాయి.
యూ టర్న్ తీసుకున్న షకీబ్ అల్ హసన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ..!
బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ యూ టర్న్ తీసుకున్నాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ఆడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాంతో స్వదేశంలో వీడ్కోలు సిరీస్ ఆడాలనే తన కోరికను మరోసారి వ్యక్తం చేశాడు. షకీబ్ గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ జట్టు తరఫున ఆడలేదు. చివరిసారిగా 2024లో కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆడాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఆగస్టు 2024లో జరిగిన ఓ హత్య కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అతడు పాకిస్తాన్, భారతదేశంలో విదేశీ సిరీస్‌లు ఆడాడు కానీ.. బంగ్లాలో మాత్రం మ్యాచ్‌లు ఆడలేదు. షకీబ్ గతంలో అవామీ లీగ్ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన అనంతరం మే 2024 నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి అతడు రాలేదు. తాజాగా స్వదేశానికి తిరిగి రావాలనే కోరికను షకీబ్ వ్యక్తం చేశాడు. ‘బియర్డ్ బిఫోర్ వికెట్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తాను మరలా అన్ని ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నానని చెప్పారు. బంగ్లాదేశ్‌లో వీడ్కోలు సిరీస్ ఆడాలనుకుంటున్నానని, జట్టులో చోటు దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నానని చెప్పారు.
ఆ హీరోతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది..
‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో ‘బేబమ్మ’గా చెరగని ముద్ర వేసుకున్నారు కృతి శెట్టి. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు మరియు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాల్లో తన నటన లోని మరో కోణాన్ని ప్రదర్శించింది. అలా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’గా మారింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బీజిగా ఉంది.. అయితే కృతి శెట్టి తాజాగా నాగ చైతన్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ, తన సహనటులలో నాగ చైతన్యతో పనిచేస్తున్నప్పుడు తనకు అత్యంత సౌకర్యంగా అనిపిస్తుందని వెల్లడించింది. అంతే కాదు చైతన్య లో తనకు నచ్చే ప్రధాన లక్షణం ఆయన నిజాయితీ అని, ఏ విషయాన్నైనా ఎటువంటి ‘ఫిల్టర్లు’ లేకుండా, మనసులో ఒకటి ఉంచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారని కృతి తెలుపుతూ.. చైతన్యన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఈ జంట ‘బంగార్రాజు’, ‘కస్టడీ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించగా, వీరిద్దరి మధ్య మంచి స్నేహం సినిమాలకు మించి ఉంటుందని కృతి మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి
ఓ నెలలో ఓ స్టార్ హీరో మూవీ వస్తుంటే ఆ సినిమాకే మూవీ లవర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం కామన్. కానీ టాప్ హీరోలంతా కట్టగట్టుకుని వస్తే ఆడియన్స్ పరిస్థితి ఏంటంటారు. అదే జరుగుతోంది శాండిల్ వుడ్‌లో. ఒక్కరు కాదు ఇద్దరు కాదు కన్నడ టైర్1 హీరోలంతా డిసెంబర్ మంత్‌పై దాడి చేస్తున్నారు. అందరి కన్నా ముందుగా వస్తున్నాడు డీ బాస్ దర్శన్. రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఈ నటుడు మధ్యలో బెయిల్‌పై వచ్చి కంప్లీట్ చేసిన ద డెవిల్ డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఛాలెంజింగ్ స్టార్ ఈ కేసులో ఇరుక్కునా కూడా ఫ్యాన్స్‌కు దర్శన్‌పై ఏ మాత్రం అభిమానం తగ్గలేదని ఈ సినిమా ట్రైలర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్సాన్స్‌ను బట్టే అర్థమౌతోంది. క్రిస్మస్, ఇయర్ ఎండింగ్ మాదే అంటున్నారు మరో నలుగురు హీరోలు. శాండిల్ వుడ్ స్టార్ హీరోస్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఫిల్మ్ 45. ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతూ డిసెంబర్ 25న రిలీజౌతోంది. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ పాన్ ఇండియన్ సినిమాను అన్ని భాషల్లో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ ముగ్గురు స్టార్లతో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మరో శాండిల్ వుడ్ టాప్ హీరో సుదీప్. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ఉపేంద్ర యుఐపై సుదీప్ మాక్స్‌తో క్లియర్ డామినేషన్ చూపించాడు. ఇప్పుడు మల్టీ స్టారర్ ఫిల్మ్ 45తో తన మార్క్ మూవీతో తలపడబోతున్నాడు కిచ్చా సుదీప్. ఇలా నలుగురు స్టార్ హీరోలు తమ సినిమాలను డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తున్నారు.
కూతురు అడిగిన ఆ ఒక్క మాటతోనే సినిమాలకు గుడ్ బై చెప్పేశా..
బాలీవుడ్ లెజెండరీ నటి, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం మరియు సుదీర్ఘ విరామం గురించి మనసు విప్పి మాట్లాడారు. 1971లో బిగ్ బీ తో వివాహం తర్వాత సినిమాలను తగ్గించిన జయా, 1981లో వచ్చిన ‘సిల్సిలా’ చిత్రం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఆ విరామానికి అసలు కారణం తన కూతురు శ్వేతా బచ్చన్ అని ఆమె వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జయా బచ్చన్ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.. ‘ఒకరోజు నేను షూటింగ్‌కు సిద్ధమవుతూ ఇంట్లోనే మేకప్ వేసుకుంటున్నాను. అప్పుడు నా దగ్గరకు వచ్చిన చిన్నారి శ్వేత ఏంచేస్తున్నావని అడిగింది. నేను పనికి వెళ్తున్నానని చెప్పగానే, చాలా అమాయకంగా.. అమ్మ నువ్వు వెళ్లొద్దు, నాన్నను మాత్రమే వెళ్లమని చెప్పు అని అడిగింది. ఇంట్లో పనివాళ్లు ఉన్నా, తల్లి తోడు లేదనే వెలితి తనలో కనిపిస్తోందని నాకు అర్థమైంది. ఆ మాటతోనే వెంటనే సినిమాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపింది. అలాగే తన రీ-ఎంట్రీ గురించి కూడా జయా బచ్చన్ ఆసక్తికర విషయాలు చెప్పారు..