ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా. ఈ కంపెనీ భారత్‌లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ అతి త్వరలో ముగియబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూమ్ కోసం కంపెనీ దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలాన్ని…
దేశ వ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల కమర్షియల సిలిండర్ ధరను రూ.6 పెంచాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1797 నుంచి 1803కి చేరింది.
Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ‘ఇండియా మాస్టర్స్’ దూసుకెళుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. సచిన్ 21 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. యువరాజ్ సింగ్ 14 బంతుల్లో 27 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంక మాస్టర్స్‌పై ఇండియా మాస్టర్స్ గెలిచిన విషయం తెలిసిందే. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్…