PM Modi: ప్రపంచాన్ని వణించిన ముంబై ఉగ్రదాడి (26/11) ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన తహావుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు భారత్‌కు అప్పగించింది అమెరికా. అయితే, ప్రస్తుతం అతడు ఎన్ఐఏ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తహావుర్ రాణా కేసుకు సంబంధించి గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Gangster Nayeem: నయీమ్ కేసులో రంగంలోకి ఈడీ..
అయితే, 14 ఏళ్ల క్రితం చేసిన ఆ పోస్ట్‌లో తహావుర్ రాణా కేసును ఉద్దేశిస్తూ అప్పటి కాంగ్రెస్ సర్కార్ దౌత్య విధానాలను నరేంద్ర మోడీ తీవ్రంగా మండిపడ్డారు. 2011లో ఈ కేసుపై అమెరికా కోర్టు సైతం కీలక తీర్పు వెల్లడించింది. ముంబై దాడుల్లో తహావుర్ రాణా ప్రత్యక్ష పాత్ర లేదని తేల్చి చెప్పింది.. అయితే, ఆ ఘటనకు కారణమైన ఉగ్ర సంస్థకు అండగా నిలిచాడన్న అభియోగాలపై అతడిని దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది.
Read Also: Tahawwur Rana: ఎన్ఐఏ కస్టడీలో తహవూర్ రాణా.. నేడు ఈ అంశాలపై ప్రశ్నలు
ఇక, ఈ తీర్పుపై 2011 జూన్ 10వ తేదీన మోడీ చేసిన ట్విట్ (ఎక్స్)లో ‘‘ముంబై దాడులకు పాల్పడిన తహావుర్ రాణాను అమాయకుడని అమెరికా ప్రకటించడం.. భారతదేశ సార్వభౌమత్వాన్ని అవమానించడమే అని పేర్కొన్నారు. మన దేశ విదేశాంగ విధానానికి ఇది భారీ ఎదురు దెబ్బ అంటూ రాసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం తహావుర్ రాణా అప్పగింత నేపథ్యంలో ఈ పోస్ట్‌ను నెటిజన్లు మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రధాని మోడీ దౌత్య విధానాలను కొనియాడుతున్నారు. తహావుర్‌ను తీసుకు రావడంలో కేంద్ర ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
#ThrowbackThursday Narendra Modi Comments On The Ordered Release Of 26/11 Plotter Tahawwur Rana By Chicago Court [June 2011] pic.twitter.com/Llp6L4BnOp
— RT_India (@RT_India_news) April 10, 2025
US declaring Tahawwur Rana innocent in Mumbai attack has disgraced the sovereignty of India & it is a “major foreign policy setback”
— Narendra Modi (@narendramodi) June 10, 2011