టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ అకిబ్ జావేద్ స్పందించారు. ఈ సందర్భంగా భారత్ స్పిన్ దాడి గురించి తమ జట్టు ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు. తమ జట్టులో స్పిన్నర్లు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రతికూలత లేదన్నారు.
IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్థాన్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా ఏళ్లుగా భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడంతా పాక్ పైనే ఉంటుంది. పైగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ఓడి, సంక్లిష్ట స్థితిలో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది దాయాది జట్టు.
గ్రూప్-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..! ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన…
భారత మార్కెట్లో టెస్లాకు చెందిన కారు ప్రత్యక్షం కానుంది. ఈ కంపెనీ ఏప్రిల్ నుంచి భారత్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. టెస్లాకు మార్గం సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్రముఖ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ CLSA నివేదిక ప్రకారం.. ఇటీవల దిగుమతి సుంకాన్ని 20% కంటే తక్కువగా తగ్గించింది. అయినా.. టెస్లాకు చెందిన అత్యంత సరసమైన మోడల్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షల నుంచి రూ. 40…
Pakistan : పాకిస్తాన్ జైళ్లలో నిర్బంధించబడిన మత్స్యకారులు తమ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది జాలర్లు తమ శిక్షను పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ వారిని విడుదల చేయలేదు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి నెలలో మారిషస్‌లో పర్యటించనున్నారు. మార్చి 12న మారిషస్ 57వ స్వాతంత్ర్య దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలమ్ వెల్లడించారు.
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించినట్లయితే అతని పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యేవి. ఐసీసీ వన్డే టోర్నమెంట్లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా అక్షర్ నిలిచేవాడు. అంతేకాకుండా.. ఐసీసీ టోర్నమెంట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కే వాడు. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్లలో ఏ భారత స్పిన్నర్ హ్యాట్రిక్ సాధించలేదు.