ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం పలికారు. మే 9న మాస్కోలో జరగనున్న విక్టరీ డే వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది మే 9న ఈ విక్టరీ వేడుకలు జరుగుతుంటాయి. 80 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోడీని పుతిన్ ఆహ్వానించారు. ఈ వేడుకల్లో మోడీ పాల్గొంటారని రష్యా ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. రష్యా సైనిక బలం, చారిత్రక వారసత్వాన్ని ప్రదర్శించే కార్యక్రమంలో పాల్గొనమని భారతదేశంతో పాటు అనేక మిత్ర దేశ నాయకులకు ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad CP Anand: వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు..
ప్రధాని మోడీ 2024, జూలైలో రష్యాలో పర్యటించారు. దాదాపు ఐదేళ్ల కాలంలో ఇదే తొలి పర్యటన. ఈ సందర్భంగా పుతిన్‌తో మోడీ కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌ను సందర్శించాలని పుతిన్‌ను మోడీ ఆహ్వానించారు. అందుకు పుతిన్ అంగీకరించారు. అయితే పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా నిర్ణయించబడలేదు.
ఇది కూడా చదవండి: Gadikota Srikanth Reddy: జగన్‌పై కుట్ర..! ఇంటి దగ్గర రక్షణ లేదు, పర్యటనల్లో లేదు..