జట్టు సభ్యులం అందరం కలిసి టీమిండియా గెలుపు కోసం కృషి చేశాం అని ఆసియా కప్ 2025 ఫైనల్ హీరో, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మన దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడానని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్లో చాలా ఒత్తిడిలోనే తాను బ్యాటింగ్ చేశానన్నాడు. ఆసియా కప్ టోర్నీలో అందరం సమష్టిగా కష్టపడ్డాం అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఫైనల్లో చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగిన…
తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు.. అతడే తిలక్ వర్మ. ప్రపంచమంతా ఈ పేరే మార్మోగుతోంది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన తిలక్‌వర్మ.. ఆసియా కప్ భారత్ వశం అయ్యేలా చేశాడు. తిలక్ వర్మ.. మా హైదరాబాదీ అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు క్రికెట్ లవర్స్. Also Read:Telangana: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగింపు.. క్రాస్ ఎగ్జామినేషన్…
టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో 5 వికెట్ల తేడాతో దాయాది పాకిస్థాన్‌ను ఓడించింది. కుల్దీప్ యాదవ్ (4/30), అక్షర్ పటేల్ (2/26), వరుణ్ చక్రవర్తి (2/30) మాయ చేయడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో భారత్ తడబడినా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుతంగా పోరాడడంతో భారత్…
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్స్ పడగొట్టి ఆసియా కప్ సొంతం చేసుకుందామనుకున్న పాకిస్థాన్‌కు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్) షాక్ ఇచ్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్.. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండే ఇనింగ్స్ ఆడాడు. అతడికి…
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫర్హాన్ (57), ఫకార్ జమాన్ (46) రాణించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (69 నాటౌట్), శివమ్ దూబె (33), సంజూ శాంసన్ (24) రాణించడంతో లక్ష్యాన్ని భారత్…
ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్స్ తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో రెండు బంతులు ఉండగానే ఛేదించి.. తొమ్మిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. ఆసియా…
PM Modi: ఆసియా కప్ 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి భారత్ 9వ సారి ఆసియా కప్ విజేతగా అవతరించింది. ఈ విజయం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని సృష్టించింది. అభిమానులు వీధుల్లోకి వచ్చి డాన్స్ లు చేస్తూ, బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకున్నారు. మరికొందరు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు.దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట…
India Vs Pakistan: ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ జట్టు సైకిల్ స్టాండ్‌ని తలపించింది. 19.1 ఓవర్లలో కేవలం 146 రన్స్‌కి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సరైన ఆరంభం ఇచ్చినప్పటికీ మిగతా బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాక్ జట్టు నడ్డి విరిచాడు. వరుణ్ చక్రవర్తి (2), అక్షర్ పటేల్ (2), జస్ప్రీత్ బుమ్రా (2) ఇతర వికెట్లు పడగొట్టారు.
IND vs PAK: ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటికే ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ను రెండుసార్లు ఓడించి ఆధిపత్యాన్ని చాటుకుంది. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా (సెప్టెంబర్ 28, ఆదివారం) రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. Madya pradesh: మరి ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ఐదేళ్ల కొడుకుని, భర్తని…
ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరు కానున్నాడు. ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఆసియా కప్ 2025 ఫైనల్‌కు రానున్నాడు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ పట్ల ఆయన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. విజేతకు తన…