India US Trade: భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత వాణిజ్యం & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బెర్లిన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడు కూడా తొందరపడి లేదా తలపై తుపాకీ గురిపెట్టి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోదని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ స్టేట్స్ సహా, అనేక ఇతర దేశాలతో భారతదేశం వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. READ ALSO: S-400: చైనా,…
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదరడంపై మోడీ, ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-అమెరికా వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అంశంపై ప్రధాని మాట్లాడుతారనే దానిపై అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. దీంతో ప్రధాని ఏ అంశం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రసంగం జీఎస్టీ(GST) సంస్కరణలకు ముందు వస్తోంది.రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ప్రధాని ప్రసంగంలో ఈ అంశం ఉండే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో టారిఫ్…
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నాడు. ఇప్పటికే భారత్ సహా పలు ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించాడు. భారత్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ అధిక సుంకాలను విధిస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశాడు. 69 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుంచి 41 శాతానికి పెరిగిన ఈ వాణిజ్య సుంకాలు ఏడు రోజుల్లో అమలులోకి రానున్నాయి.
India vs Trump Tariffs: భారత్ తమకు మిత్ర దేశమంటూనే.. 25 శాతం టారిఫ్‌లతో పాటు పెనాల్టీలు కూడా విధించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సుంకాల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ప్రచారాన్ని అధికార వర్గాలు కొట్టిపడేశాయి.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ దిగుమతి టారిఫ్‌ల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశానికి కాస్త భారీగానే ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశముంది. ట్రంప్ తాజాగా కాపర్‌పై 50 శాతం దిగుమతి టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించగా.. ప్రజల మందులపై 200 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా.. ఈ రోజు కాపర్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాం. దీని మీద టారిఫ్ 50…
Tariff Cuts: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ‘‘పరస్పర సుంకాలు’’, సుంకాల పెంపుపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించారు. ఇండియాపై కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పారు. అయితే, ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తన సుంకాలను చాలా వరకు తగ్గించుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజలు తర్వాత, అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించడానికి కట్టుబడి లేమని భారత్ చెబుతోంది.
US Reciprocal Tariffs: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ‘‘సుంకాల’’తో ప్రపంచదేశాలను భయపెడుతున్నాడు. ‘‘పరస్పర సుంకాలు’’ తప్పకుండా ఉంటాయని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు విధించారు. మరోవైపు సుంకాలు విధింపులో భారత్ అగ్రస్థానంలో ఉందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ తన అక్కసును వెళ్ళగక్కారు.