US Reciprocal Tariffs: అమెరికా సుంకాల భయం.. మార్చి 15 నాటికి టారిఫ్‌లపై ప్రభుత్వం సమీక్ష..
- అమెరికా ‘‘పరస్పర సుంకాల’’ భయం..
- మార్చి 15 నాటికి టారిఫ్‌లపై రివ్యూ..
- ఇప్పటికే ఉన్నత స్థాయి ప్యానెట్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Reciprocal Tariffs: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ‘‘సుంకాల’’తో ప్రపంచదేశాలను భయపెడుతున్నాడు. ‘‘పరస్పర సుంకాలు’’ తప్పకుండా ఉంటాయని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు విధించారు. మరోవైపు సుంకాలు విధింపులో భారత్ అగ్రస్థానంలో ఉందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ తన అక్కసును వెళ్ళగక్కారు.
ఈ నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలపై తగ్గింపును సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని భారత్ నియమించింది. మార్చి 15నాటికి దాని నివేదిక సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2 నాటికి భారత ఎగుమతులపై పరస్పర సుంకాలు విధించాలనే అమెరికా అధ్యక్షుడి ప్లాన్ ముందు ఈ చర్య వచ్చింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈ కమిటీ తన ఫలితాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ రెండింటికీ సమర్పించనుంది.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ తప్పనిసరిగా సాధ్యమయ్యే సుంకాల తగ్గింపుల పరిధిని అంచనా వేస్తుంది. తదుపరి ఉత్తమ చర్యల్ని ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. దిగుమతి చేసుకునే వస్తువుల్ని జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు వాటిపై సుంకాల సర్దుబాట్లు చేసే పనిని కమిటీ పరిశీలిస్తుంది. ఈ సమీక్ష ప్యానెల్ ప్రత్యేకంగా 15–20%, 50–70% , 70–80% మధ్య ఉన్న సుంకాలను, కస్టమ్ ప్రయోజనాల కోసం నిర్దిష్ట ఉత్పత్తిని గుర్తించే 8-అంకెల కోడ్‌లో రేటు సర్దుబాటు చేయవచ్చా అనేదానిపై దృష్టిపెడుతుందని తెలిసింది.
Read Also: Hyperloop: “3 గంటల్లోపే హైదరాబాద్ టూ ఢిల్లీ”.. “హైపర్‌లూమ్” రవాణాకు భారత్ సిద్ధం..
ట్రంప్ బెదిరింపులతో ఇండియా ఇప్పటికే కొన్ని ప్రోడక్ట్స్‌పై సుంకాలను తగ్గించింది. బోర్బర్ విస్కీపై 150 శాతం నుంచి 100 శాతానికి సుంకాన్ని తగ్గించింది. దీంతో పాటు ఫిష్ హైడ్రోలైజేట్, స్క్రాప్ మెటీరియల్స్, ఉపగ్రహ పరికరాలు, ఈథర్నెట్ స్విచ్‌లు, మోటార్ సైకిళ్ల వంటి దిగుమతులపై సుంకాలను తగ్గించింది. కమిటీ తన సిఫారసుల్ని ప్రతిపాదించిన తర్వాత ప్రధాని కార్యాలయం వీటిని పరిశీలించాల్సి ఉంటుంది. భారత్ తన సొంత ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికాతో ట్రేడ్ బ్యాలెన్స్ కొనసాగించాలని కోరుకుంటోంది.
మరోవైపు భారత్-అమెరికా మధ్య ప్రతిపాది వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. రాబోయే 6-8 నెలల్లో దీనిని సమర్పించాలని భావిస్తున్నారు. ‘‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’’ ప్రకారం, ఇరు దేశాలు తమ తమ ఉత్పత్తులపై కస్టమ్ సుంకాలను తొలగించడం లేదా గణనీయంగా తగ్గించడానికి పని చేస్తుంది. దీంతో వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించడం సులభతరం అవుతుంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సమయంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు చేయాలని, అంటే 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!