India vs Trump Tariffs: భారత్ తమకు మిత్ర దేశమంటూనే.. 25 శాతం టారిఫ్‌లతో పాటు పెనాల్టీలు కూడా విధించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సుంకాల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ప్రచారాన్ని అధికార వర్గాలు కొట్టిపడేశాయి. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగే చర్చల్లో తమ నిర్ణయాలను వెల్లడిస్తామన్నారు. ట్రంప్ టారిఫ్‌లపై ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగడం లేదని భారత్ స్పష్టం చేసింది. తమ మౌనమే సరైన సమాధానం.. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని తెలియజేశారు.
Read Also: US: ట్రంప్ 6 శాంతి ఒప్పందాలు చేశారు.. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న వైట్‌హౌస్
ఇక, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, అధికార వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేశాయి. మొదట అణు పరీక్షలు చేసినప్పుడు కూడా మనపై ఇలాంటి ఆంక్షలే విధించారు.. అప్పుడు మనది చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ చాలా అభివృద్ధి చెందినది.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.. ఇరువురి ప్రయోజనాలకు ఉపయోగపడే పరిష్కార మార్గానికి రెడీగా ఉన్నామని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి.
Read Also: Deccan Kitchen Case: కోర్టుకు వెంకటేష్, రానా, సురేష్ బాబు
అయితే, అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయి.. ఆత్మ విశ్వాసంతో మేము ముందడుగు వేస్తున్నామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పార్లమెంటులో తెలిపారు. దేశ ప్రయోజనాలు, చిన్న పరిశ్రమలు, రైతులు, వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. రష్యాతో భారత్ దౌత్యం చేయడం వల్లే పన్నులు విధిస్తున్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తు చేశారు. భారత ఆర్థికవ్యవస్థ పతనమైందని, అది ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తప్ప ప్రతి ఒక్కరికీ తెలుసని సెటైర్లు వేశారు.