పెళ్లి నిశ్చితార్థం ముందు స్నేహితుడి హత్య చూసి జీవితాన్ని విడిచిన యువకుడు సికింద్రాబాద్‌లోని వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక విషాద సంఘటన కలకలం రేపింది. మయ్ 4న నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు, తన మిత్రుడు హత్యకు గురవడం చూసి తీవ్ర మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఒక్కరోజే చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. బౌద్ధనగర్‌కు చెందిన మోహన్ కృష్ణ అనే బైక్ మెకానిక్‌కు పెళ్లి నిశ్చితార్థం మే 4న జరగాల్సి ఉంది. అయితే,…
పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పాలిన ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ నాయకులు నిరంతరం ఒళ్లు బలుపు మాటలు, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున…
PM Modi: ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వరసగా సమావేశాలతో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు. మంగళవారం, ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి,…
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. టూరిస్టులు రీల్స్ చేస్తున్న సమయంలో కొందరి మొబైల్‌లో ముష్కరుల దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తాజాగా, జిప్ లైనర్‌పై వెళ్తున్న ఓ టూరిస్ట్ రికార్డ్ చేసిన వీడియోలో కూడా టెర్రరిస్టుల దాడి రికార్డ్ అయింది. అయితే, దీనికి ముందు జిప్ లైన్ ఆపరేటర్ చేసిన ‘‘ అల్లాహు అక్బర్’’ నినాదాలు సంచలనంగా మారాయి. ఆపరేటర్ ముజమ్మిల్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
BJP vs Congress: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ..‘‘అవసరమైన సమయాల్లో మిస్ అవుతారు’’ అని కామెంట్ చేసింది. ప్రధానిని సూచించే ఒక ఫోటోని పోస్ట్ చేసి, దానికి తల లేకుండా ఉంచింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pahalgam terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే, టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో ఉగ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి మార్గం లేకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేట్ నుంచి రాగా, ఒకరు ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చారు. నాలుగో ఉగ్రవాది వీరికి సపోర్ట్ చేయడానికి అడవిలో దాగి ఉండొచ్చని దర్యాప్తు…
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ దౌత్యచర్యలు మొదలుపెట్టింది. ఈ చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేయడంతో పాటు డెడ్‌లైన్ లోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సరిహద్దుల్లోని రైతులకు కీలక ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. సరిహద్దు వెంబడి ఉన్న రైతులు 48 గంటల్లో పంట కోత పూర్తి చేసి తమ పొలాలను ఖాళీ చేయాలని శనివారం బీఎస్ఎఫ్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
India Pakistan: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం జీలం నదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయని పాకిస్తాన్ మీడియా నివేదిస్తోంది. పాక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేసినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్‌లో జీలం నీటి మట్టం పెరిగినట్లు చెబుతున్నారు.
Hardeep Puri: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్‌ని తెగ భయపెడుతోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ దాదాపుగా ఎడారిగా మారుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్‌కి ఆకలి చావులే గతి. అయితే, సింధు జలాలపై పాక్ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని సింధు నదిని ‘‘జీవనాడి’’గా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్…