Pakistan: ‘‘అయోధ్యలో బాబ్రీ మసీదు, అజాన్ పఠించేది పాక్ ఆర్మీ చీఫ్, సిక్కులు యుద్ధం చేయొద్దు’’..
- పాకిస్తాన్ సెనెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
- బాబ్రీ మసీదుకు తొలి ఇటుక పాక్ సైనికుడే వేస్తాడు..
- అజాన్ పఠించేది ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్..
- ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేలా రాజకీయ నేతల వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పలువురు పాకిస్తాన్ నేతలు చెబుతున్నారు. భారత్ దాడి చేస్తే తాము తీవ్రంగా స్పందిస్తామని చెబుతూనే, పాకిస్తాన్ యుద్ధాన్ని నిలురించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. మంగళవారం, ప్రధాని మోడీ అధ్యక్షత జరిగిన అత్యున్నత సమావేశంలో, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, పాక్ రాజకీయ నాయకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానడం లేదు. తాజాగా, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పార్లమెంటేరియన్లు (PPPP) నాయకురాలు పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాకిస్తాన్ సెనెట్‌లో ఆమె ప్రసంగిస్తూ.. ‘‘ కొత్తగా నిర్మించే బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను పాకిస్తాన్ సైనికుడు వేస్తాడు’’ అని వ్యాఖయానించింది. ఇంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మొదటి అజాన్ పఠిస్తారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. మేము గాజులు ధరించి లేమని ఆమె అన్నారు.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
Read Also: Visakha Rain: విశాఖలో మళ్లీ వర్షం.. సింహాచలంలో భక్తుల దర్శనానికి ఇక్కట్లు
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత వ్యతిరేక వైఖరిని ఆమె ప్రశంసించారు. పంజాబ్ ప్రజలు ముఖ్యంగా సిక్కులు పాకిస్తాన్‌తో యుద్ధానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ‘‘గురునాంక్ దేవ్’’ భూమిగా అభివర్ణిస్తూ, ఇది సిక్కుల పవిత్ర స్థలమని, అందువల్ల సిక్కులు యుద్ధం చేయవద్దని కోరారు.
పాకిస్తాన్ భారతదేశాన్ని 1000 ఏళ్లు పాలించిందనే విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలని ఏఎన్పీ పార్టీ సెనెటర్ హాజీ హిదయతుల్లా ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ పాలకుల వంటి వివిధ ముస్లిం రాజవంశాలు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను దాదాపు 13 నుండి 19వ శతాబ్దం వరకు పాలించాయి. అయితే, వీరు పాకిస్థానీలు కాదు, పాకిస్తాన్ ఒక దేశంగా 1947లో ఏర్పడింది. ముస్లిం పాలకులు టర్కీ, ఆఫ్ఘన్, మొఘల్ మూలానికి చెందినవారు. హాజీ హిదయతుల్లా చరిత్ర తెలియకుండా ఈ వ్యాఖ్యలు చేశాడు.
❗️Pakistani Senator Palwasha Mohammad Zai Khan on Tuesday.
'The First brick at the new Babri Mosque in Ayodhya will be put by Pak Army soldiers, & first azan by Pakistan Army chief Munir'
'We are not wearing bangles'
Lauds India listed Khalistani terrorist Pannun.
Join |… pic.twitter.com/iUn0mPyzf6
— Satyaagrah (@satyaagrahindia) April 30, 2025
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!