Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి దాడి చేస్తుందో అని పాకిస్తాన్ హడలి చేస్తోంది. బయటకు తన ప్రజల మెప్పు కోసం ఎన్నో బీరాలు పలుకుతున్నప్పటికీ, లోలోపల మాత్రం భయపడుతోంది. ఇప్పటికే, ఆర్థిక దరిద్రంలో పాకిస్తాన్ ఉంది. యుద్ధం చేస్తే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందనేది అక్కడి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. యుద్ధం చేయాల్సి వస్తే, మూడు రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు, ఒక వేళ యుద్ధం కోసం…
Iran: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాక్కి వ్యతిరేకంగా దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జల ఒప్పందం’’ని రద్దు చేసింది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు పాక్కి వెళ్లకుండా ప్రణాళికలు రచిస్తోంది.
Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయినప్పటికీ, ఈ దాడి గురించి పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన ఖండన రాలేదు. దీనికి తోడు, భారత్ దాడి చేస్తే ప్రతిదాడి ఎలా చేయాలనే దానిపైనే దాయాది దేశం చూపు ఉంది. ఆ దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులకు పాల్పడినట్లు తెలిసినా కూడా తమ వారు కాదని ఇంకా బుకాయిస్తోంది.
Indus water: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు, దాని ఉపనదులు నుంచి ఒక్క చుక్క నీరు దక్కకుండా భారత్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఇది ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించింది. సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నిర్ణయాన్ని భారత్, పాక్ ప్రభుత్వానికి అందించింది.
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ దాడికి బాధ్యతను టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో లష్కరే, టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా…
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్ని సౌదీ అరేబియా,…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వివరణ ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలను స్టేడియం పైకప్పుపై ఎగురవేస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..
India On Pak: ఇటీవల తాలిబన్లు టార్గెట్గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.
Online Love: ఉత్తర్ ప్రదేశ్ అలీఘఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన వార్త వైరల్ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాయాది దేశంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కి చెందిన సనా రాణి(21)కి బాదల్ బాబులో ఆన్లైన్ స్నేహం కుదిరింది. తన ఫేస్బుక్ ఫ్రెండ్ని కలవడానికి సరిహద్దు దాటి, పాకిస్తాన్ పంజాబ్…
భారత్- పాకిస్థాన్ పేర్లు వచ్చినప్పుడల్లా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. చాలా విషయాల్లో పాకిస్థాన్ కంటే భారత్ చాలా ముందుంది అనడంలో సందేహం లేదు. కొన్ని విషయాల్లో మాత్రం పాకిస్థాన్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. అదేంటో అని సందేహిస్తున్నారు. ఏం లేదండి.. పాకిస్థాన్ దేశం మధుమేహ వ్యాధిగ్రస్తుల జాబితాలో మనకంటే చాలా అడుగులు ముందుంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్లో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ అంశంలో మాత్రం…