Jaish-e-Mohammad (JeM): పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ తన వర్కింగ్ స్టైల్ను మార్చుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా జైష్ మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జైష్ చీప్ మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో జమాత్-ఉల్-మొమినాత్ అనే మహిళా ఉగ్రవాదం సంస్థను ఏర్పాటైంది
India slams Pak: అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని గమనించాం. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల దుర్వినియోగం చేయడంలో తీవ్రమైన చెడ్డ పేరు ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక స్థితి లేదు. కపట ధర్మాలను…
Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేది ప్రపంచానికి తెలుసు. ఇటీవల, ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ వెనక కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లు మన భద్రతా ఏజెన్సీలు తేల్చాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తానీ లీడర్ చౌదరి అన్వరుల్ హక్ కూడా తాము ఉగ్రవాదానికి పాల్పడుతున్నామని బహిరంగంగా ఒప్పుకున్నాడు.
Religious Conversion: పాకిస్తాన్కు వెళ్లి తప్పిపోయిన మహిళ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ సందర్భంగా పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కనిపించకుండాపోయిన సిక్కు మహిళ సరబ్జీత్ కౌర్(52) ఇస్లాం మతంలోకి మారి పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది.
Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్ను అస్థిరపరిచేందుకు భారత్ ఉగ్రవాదాన్ని నిర్వహిస్తుందని ఫరీఫ్ మంగళవారం అన్నారు. భారతదేశ…
India - Afghanistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్తో ‘‘సింధూ జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. పాకిస్తాన్కు ఈ నదీ జలాలు అత్యంత కీలకం. ఆ దేశ వ్యవసాయం సింధూ దాని ఉప నదులపైనే ఆధారపడి ఉంది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ కూడా భారత దారిలోనే నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే నదులను నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కునార్’’ నదిపై డ్యామ్ నిర్మించాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.
IAF: భారతదేశం జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన వందలాది ఉగ్రవాదులు హతం అవ్వడంతో పాటు, భారత వైమానిక దాడిలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలు 10 వరకు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఓ రకంగా చెప్పాలంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. తాము భారత్కు చెందిన 6 ఫైటర్ జెట్లను కూల్చామని పాకిస్తాన్ తన ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, అంతర్జాతీయంగా ఈ…
Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య కొత్తగా ‘‘సర్ క్రీక్ ’’ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచడంపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. ఈ సమస్యను భారత్ చర్చల ద్వారా చాలా సార్లు పరిష్కరించేందుకు ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు మాత్రం వేరేగా ఉన్నాయని రాజ్ నాథ్ అన్నారు. అసలు ఏంటీ సర్…
Ravindra Kaushik: ఒక వ్యక్తి మొత్తం పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశానికి భయం అంటే ఏంటో చూపించాడు. వారి ఆర్మీలోనే ఉంటూ, భారతదేశానికి పనిచేసిన గొప్ప వ్యక్తి, ‘‘బ్లాక్ టైగర్’’గా కొనియాడబడిన రవీంద్ర కౌశిక్ ధైర్యం, తెగువ చాలా మందికి ఆదర్శం. భారత గూఢచారిగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ, నిఘా ఏజెన్సీలకు గర్వకారణం. అయితే, ఎప్పటికైనా ఒక గూఢచారిని కలవరపెట్టే అంశం, తన ముసుగు తొలిగిపోవడం. రవీంద్ర కౌశిక్కు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఎవరు…
India-Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తా్న్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ సమయంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విమరణకు బ్రతిమిలాడటంతో, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.