India-Pak Tensions: భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు.. అమిత్ షా- అజిత్ దోవల్ కీలక భేటీ..
- భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- కేంద్రమంత్రి అమిత్ షాతో అజిత్ దోవల్ భేటీ..
- సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pak Tensions: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుంది. దాయాది దేశం రెచ్చగొట్టే చర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు మోడీ సర్కార్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని వ్యవస్థల పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్‌ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్‌ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి ఇంట్లో ఈ కీలక సమావేశం జరిగింది.
Read Also: Amala Paul : నేను హీరోయిన్‌ని అనే విషయం నా భర్తకి చెప్పలేదు..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
అయితే, చొరబాటు ఘటనలు జరుగుతున్న తరుణంలో పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ కు చెందిన ఓ వ్యక్తిని పంజాబ్ సరిహద్దు దగ్గర బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు హతమార్చారు. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్లున్న పాక్ సరిహద్దును బంద్ చేశారు. ఎవరైనా సరిహద్దుల దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే.. కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలోని సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్ గట్టిగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో సుమారు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ నేడు కూడా ఎల్ఓసీకి ఆవలివైపు నుంచి భారీ స్థాయిలో కాల్పులు జరుపుతుంది. ముఖ్యంగా యూరి, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో వీటి తీవ్రత భారీగా కనిపిస్తుంది. ఈ కాల్పుల్లో చాలా మంది ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!